Salaar: అన్ని అనుకున్నట్లు జరిగితే ఈపాటికి ఇండియా మొత్తం సలార్ ఫీవర్ కమ్మేసేది. కానీ అనుకోని కారణాలు వలన డైనోసార్ లాంటి ఈ సినిమా వాయిదా పడింది. దీనితో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఇప్పటికి కూడా విడుదల తేదీ ఎప్పుడు అనేది ఇంకా డిసైడ్ చేయకపోవడం ఫ్యాన్స్ ను మరింత ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం దీనిపై చిత్ర యూనిట్ తీవ్ర స్థాయిలో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సలార్ లాంటి పెద్ద సినిమాను విడుదల చేయాలంటే దానికి సరైన డేట్ కావాలి. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా సినిమా డిస్ట్రిబ్యూటర్లు అనుమతి తప్పనిసరి. అందుకే సలార్ డిస్ట్రిబ్యూటర్లతో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసింది నిర్మాణ సంస్థ. ఈ సమావేశంలో విడుదల తేదీపై దాదాపు ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.
ముందుగా ఈ సినిమాను 2024 సంక్రాంతి కి తీసుకోవాలని అనుకున్నారు, ఇటు తెలుగులో కావచ్చు, అటు తమిళంలో కావచ్చు ఆ సీజన్ బాగా కలిసి వస్తుంది. కానీ నార్త్ బెల్ట్ లో ఆ సీజన్ కు పెద్దగా మార్కెట్ ఉండదు అనే టాక్ నడుస్తుంది. మరోపక్క సంక్రాంతికి సౌత్ లో అన్ని చోట్ల పెద్ద హీరోల సినిమాలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో మహేష్ బాబు “గుంటూరు కారం” లాంటి సినిమా లైన్ లో ఉంది. ఈ సమయంలో వస్తే స్క్రీన్స్ ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సలార్ లాంటి సినిమాకు సోలో రిలీజ్ డేట్ అవసరం.
అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. నవంబర్ 10 వ తేదీని అనధికారికంగా లాక్ చేసినట్లు తెలుస్తోంది. పైగా గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో ఈ రెండు నెలల సమయం అయితే సరిపోతుందని భావిస్తున్నారు. సలార్ సినిమా క్లోజ్ సర్కిల్స్ వాళ్లకు ఈ మేరకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అన్ని చోట్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే నవంబర్ 10 వ తేదీ డైనోసార్ ను విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి