Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 ఆగిపోయింది. దీనిపై ఫ్యాన్స్ లో అసంతృప్తి నెలకొంది. అయితే రెగ్యులర్ షో కాదు, బిగ్ బాస్ 7 లైవ్ స్ట్రీమింగ్ ఆపేశారు. స్టార్ మా అనుబంధ సంస్థ హాట్ స్టార్ లో బిగ్ బాస్ షో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అంటే 24 గంటలు కంటెస్టెంట్స్ ప్రవర్తనను మనం చూడవచ్చు. దీని వలన ఎపిసోడ్ లో ప్రసారం చేసే సంఘటనలు ముందుగానే తెలిసిపోతున్నాయి. ఎపిసోడ్ రోజంతా జరిగిన పరిణామాల నుండి ఆసక్తికరమైనవి ఎంపిక చేసి, ఎడిట్ చేసి ప్రసారం చేస్తారు. టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సెన్సార్ ఆంక్షలు కూడా ఉన్నాయి.
హాట్ స్టార్ లైవ్ వలన సాయంత్రం ప్రసారం చేసే ఎపిసోడ్లో కొత్తదనం ఏమీ ఉండటం లేదు. పైగా ముందుగానే విషయాలు లీక్ కావడం ఎపిసోడ్ పై ప్రభావం చూపుతుంది. అయితే శని, ఆదివారాలు హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇస్తారు. ఈ వారం రోజుల కంటెస్టెంట్స్ ప్రవర్తన, పెర్ఫార్మన్స్ మీద రివ్యూ నిర్వహిస్తారు. వీకెండ్ ఎపిసోడ్స్ లైవ్ స్ట్రీమింగ్ అనేది హాట్ స్టార్ లో అందుబాటులో ఉండదు.
ఇందులో భాగంగా బిగ్ బాస్ షో లైవ్ స్ట్రీమింగ్ ని హాట్ స్టార్ లో ఆపేశారు. అయితే పర్మినెంట్ గా కాదు. మరలా ఆదివారం రాత్రి నుండి హాట్ స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. 24 గంటలు బిగ్ బాస్ షో చూసే ఫ్యాన్స్ ని ఇది నిరాశపరిచే అంశం. కానీ వారానికి 5 రోజులు లైవ్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయవచ్చు. బిగ్ బాస్ సీజన్ 6 అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. చెప్పాలంటే డిజాస్టర్. అందుకే సీజన్ 7ని సక్సెస్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
ఇక వీకెండ్ వచ్చిందంటే ఎలిమినేషన్ ఫీవర్ వెంటాడుతుంది. మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఇంటిని వీడనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ రాథోడ్ హౌస్ వీడే అవకాశం కలదంటున్నారు. పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, ప్రిన్స్ యావర్ మొదటి ఆరు స్థానాల్లో ఉన్నారట. దామిని, కిరణ్ రాథోడ్ కి తక్కువ ఓట్లు పోలయ్యాయట. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కావచ్చన్న మాట వినిపిస్తోంది.