Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొట్టమొదటిసారి పీరియాడిక్ జానర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. సినిమాలోని ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తీస్తే సినిమా పూర్తి అయ్యినట్టే. అయితే చాలా కాలం నుండి ఈ షూటింగ్ మొత్తం హోల్డ్ లో పడిపోయింది.
పవన్ కళ్యాణ్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడం, దానికి తోడు మళ్ళీ ఆయన రాజకీయాల్లో కూడా సమాంతరం గా బిజీ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే నిర్మాత AM రత్నం ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయిల వరకు ఖర్చు చేసాడు. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడం వల్ల నిర్మాత రత్నం కి వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి.
నిర్మాత పడుతున్న ఇబ్బందులను గమనించిన పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుండి కానీ, లేదా ఆగష్టు మొదటి వారం నుండి కానీ డేట్స్ కేటాయిస్తాను అని చెప్పారట. ఇప్పటికే హైదరాబాద్ లో చాలా కాలం నుండి సారధి స్టూడియోస్ లో వేసిన సెట్స్ ని పీకేశారు. ఆ సెట్స్ మొత్తాన్ని ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాలకు షిఫ్ట్ చేయబోతున్నారట. ఇక నుండి షూటింగ్ మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లోనే జరగబోతుంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కేవలం 30 రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉందట.
ఒకవేళ టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయితే వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. వాస్తవానికి అనుకున్న సమయానికి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చి ఉంటే ఈపాటికి షూటింగ్ మొత్తం పూర్తై, ఈ ఏడాది దసరా కి సినిమా విడుదల అయ్యేదట. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మరో పది నెలలు వేచి చూడక తప్పదు.