Gollapudi Maruti Rao: సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామ సుందరి గారు మరణించారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. వయోభారంతో చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామ సుందరికి గొల్లపూడితో 1961లో వివాహమైంది. 2019 డిసెంబరులో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే.

అప్పట్లో, శివకామ సుందరి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మారుతీరావు గారికి ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అది 1959వ సంవత్సరం. అప్పట్లో ఉద్యోగాలు రావడం కొంచెం కష్టంగా ఉన్న సమయం. అయితే, తనలోని రచన మారుతీ రావుకి ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగం వచ్చేలా చేసింది. ఆ తర్వాత చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశాడు.
Also Read:నీ చల్లని దీవెనలు మరు జన్మలకు కావాలి – మెగాస్టార్ చిరంజీవి
ఆ తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. మొత్తమ్మీద మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమా రంగ ప్రవేశం చేసి.. గొప్పగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ఎంత పేరు వచ్చినా తన సతీమణి శివకామ సుందరి అంటే ఎంతో అభిమానం చూపేవారు.

అయితే, మాటల రచయితగా ‘ఆలయశిఖరం’తో మారుతీ రావుకి బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ సమయంలో ఆయనకు భోజనం చేయడానికి కూడా తీరిక ఉండేది కాదు. అందుకే, ఆ సమయంలో ఆయనకు గోరుముద్దలు కలిపి పెట్టేవారట శివకామ సుందరి గారు. ఆయనను ఎప్పుడు ఆమె చిన్నపిల్లడిలా ఎంతో అపురూపంగా చూసుకునే వారట. ఏది ఏమైనా ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు అంటే దానికి ముఖ్య కారణం శివకామ సుందరి గారే. .
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున శివకామ సుందరి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: కాళేశ్వరంలో అవినీతి చేపలు.. విచారణ జరపాలంటున్న రేవంత్ రెడ్డి..