Shruti Haasan: హీరోయిన్ శృతీహాసన్ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో పలు విషయాలను పంచుకోవడానికి ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ చేస్తూ ఉంటుంది. ఇక జనవరి 25న తన పుట్టిన రోజును జరుపుకుంది ఈ బ్యూటీ. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపింది. తన పై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్ అవుతూ పనిలో పనిగా ఒక పోస్ట్ కూడా పెట్టింది.

ఇంతకీ శృతీహాసన్ ఏమి పోస్ట్ పెట్టింది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘నాపై ప్రేమను చూపేందుకు టైమ్ కేటాయించిన మీకు నేను ఏమి ఇవ్వగలను ? అందుకే, మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. అసలు మీ ప్రేమను మాటల్లో చెప్పలేను. ఈ అందమైన, క్లిష్టమైన భూమి పై నా జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయింది. ఇదే నన్ను కొంచెం బాధ పెట్టింది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !
కానీ నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్ధం చేసుకున్నాను. నన్ను నేను రియాలిటీకి దగ్గరగా ఉంచుకోవాలని ఆశ పడుతున్నాను. ప్రత్యక్షంగా కావొచ్చు.. పరోక్షంగా కావొచ్చు. జీవితంలో నాకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుంటాను.

ఇక మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే మీకు మంచి కిక్ ఇచ్చేలా అప్ డేట్స్ ఇస్తా’ అంటూ శ్రుతి తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. అన్నట్టు హీరోయిన్ శృతీహాసన్ ప్రస్తుతం బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫుల్ గ్లామర్ డాల్ గా కనిపించబోతుంది.
View this post on Instagram
Also Read: విషాదం: ఆ గొప్ప సహజ నటుడి సతీమణి ఇక లేరు !