Apsara Rani: బోల్డ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ గా అప్సర రాణికి ఇండస్ట్రీల్లో మంచి గుర్తింపు ఉంది. అందాల అరబోతకు ఏమాత్రం వెనుకాడకపోవడంతో హిట్స్ లేకపోయినా ఆమెకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవలే రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీలో ‘భూమ్ బద్దలు’ అంటూ స్పెషల్ సాంగ్ చేసి ప్రేక్షకుల దృష్టిని అప్సర రాణి తనవైపు తిప్పుకుంది.

వర్మ తెరకెక్కించిన ‘థిల్లర్’ మూవీ కంటే ముందు అప్సర రాణి పలు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాలేవీ కూడా ఆమెకు తగినంత గుర్తింపు తీసుకురాలేదు. ఈక్రమంలోనే వర్మ దృష్టి అప్సర రాణిపై పడింది. ఈ భామలోని గ్లామర్ మొత్తాన్ని వర్మ ‘థిల్లర్’ మూవీలో చూపించాడు. గ్లామర్ తోపాటు నటనపరంగా అప్సర రాణి సూపర్బ్ అనిపించుకుంది. దీంతో ఆమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కుతున్నాయి.
ఈ మూవీ తర్వాత అప్సర రాణి టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈక్రమంలోనో తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను అప్సర రాణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కన్నడ ఇండస్ట్రీలో తనను ఓ మూవీలో హీరోయిన్ గా మూవీ మేకర్స్ ఎంపిక చేశారని తెలిపింది. అయితే డిస్కషన్స్ కోసం తనను రూమ్‌కు ఒంటరిగా రమ్మన్నారని చెప్పింది.
తన కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తాన్నారని.. తాను మాత్రం అక్కడికి తన నాన్నతో వెళ్లానని గుర్తు చేసుకుంది. అక్కడ పరిస్థితి అర్థమై నాన్నతో కలిసి అక్కడి నుంచి పారిపోయి వచ్చానని అప్సర రాణి నాటి చేదు అనుభవాన్ని చెప్పింది. తెలుగులో మాత్రం తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని తెలిపింది.
తెలుగు టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది. ఇక్కడి ప్రేక్షకులు హీరోయిన్లను బాగా ఆదరిస్తారని చెప్పింది. ఈ భామ ప్రస్తుతం హీరోయిన్ గా కంటే ఐటమ్ సాంగ్స్ తో దుమ్ములేపుతోంది. గోపిచంద్ ‘సిటీమార్’లోనూ అప్సర రాణి ఓ స్పెషల్ సాంగ్ చేసి అభిమానులను అలరించింది.
[…] Corona Update in AP, Telangana: మరోసారి మహమ్మారి ముసురుకుంటోంది. తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ పరుచుకుంటోంది. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఆంక్షలు.. లాక్ డౌన్ దిశగా సాగుతోంది. ఏపీలో ఒక్కరోజులో 5వేలకు వరకూ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో రోజుకు 2వేలు అని చెబుతున్నా ఆ సంఖ్య ఎక్కువేనంటున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగా కేసులు నమోదు కావడం దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కేసుల పెరుగుదల ఆగడం లేదు. మొదటి, రెండే వేవ్ కంటే ఈసారి కేసులు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా నివారణకు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ సోకడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం వరకు 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 4,570 కేసులు నమోదు కాగా.. తెలంగాణలో 1,963 నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రెండు రాష్ట్రాలు విభిన్న రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. […]