spot_img
Homeఎంటర్టైన్మెంట్Shruti Haasan: మీ ప్రేమను మాటల్లో చెప్పలేను - శృతీహాసన్‌

Shruti Haasan: మీ ప్రేమను మాటల్లో చెప్పలేను – శృతీహాసన్‌

Shruti Haasan: హీరోయిన్‌ శృతీహాసన్‌ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ తో పలు విషయాలను పంచుకోవడానికి ఇన్‌ స్టాగ్రామ్‌ లో లైవ్‌ చేస్తూ ఉంటుంది. ఇక జనవరి 25న తన పుట్టిన రోజును జరుపుకుంది ఈ బ్యూటీ. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపింది. తన పై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్‌ అవుతూ పనిలో పనిగా ఒక పోస్ట్‌ కూడా పెట్టింది.

Shruti Haasan
Shruti Haasan

ఇంతకీ శృతీహాసన్‌ ఏమి పోస్ట్ పెట్టింది అంటే.. ఆమె మాటల్లోనే.. ‘నాపై ప్రేమను చూపేందుకు టైమ్‌ కేటాయించిన మీకు నేను ఏమి ఇవ్వగలను ? అందుకే, మిమ్మల్ని సంతోష పెట్టడానికి నేను ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. అసలు మీ ప్రేమను మాటల్లో చెప్పలేను. ఈ అందమైన, క్లిష్టమైన భూమి పై నా జీవితంలో మరో సంవత్సరం గడిచిపోయింది. ఇదే నన్ను కొంచెం బాధ పెట్టింది.

Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !

కానీ నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్ధం చేసుకున్నాను. నన్ను నేను రియాలిటీకి దగ్గరగా ఉంచుకోవాలని ఆశ పడుతున్నాను. ప్రత్యక్షంగా కావొచ్చు.. పరోక్షంగా కావొచ్చు. జీవితంలో నాకు తారసపడే ప్రతి ఒక్కరి నుంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకునేలా ప్లాన్‌ చేసుకుంటుంటాను.

Shruti Haasan
Shruti Haasan

ఇక మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే మీకు మంచి కిక్ ఇచ్చేలా అప్ డేట్స్ ఇస్తా’ అంటూ శ్రుతి తన మనసులోని మాటలను చెప్పుకొచ్చింది. అన్నట్టు హీరోయిన్‌ శృతీహాసన్‌ ప్రస్తుతం బాలయ్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఫుల్ గ్లామర్ డాల్ గా కనిపించబోతుంది.

Also Read: విషాదం: ఆ గొప్ప సహజ నటుడి సతీమణి ఇక లేరు !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version