Namrata Shirodkar: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మహేశ్‌బాబు సతీమణి నమ్రత పోస్ట్ చేసిన ఈ ఎమోషనల్ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ పోస్ట్ లో నమ్రత ఏమి మెసేజ్ చేసింది అంటే.. ‘గత 16 ఏళ్లుగా ప్రతి రోజూ మిమ్మల్ని మిస్ అవుతూనే ఉన్నాను.
మీరే నా వెనకుండి ధైర్యాన్ని ఇచ్చారు. అదే తండ్రి ప్రేమ. నా హృదయంలో మీపై ఎప్పటికీ ప్రేమ, స్థానం ఉంటుంది. మీరు ఎక్కడున్నా నన్ను చూసి గర్వంగా ఫీలవుతుంటారని భావిస్తున్నా’ అంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా నమ్రత ఈ పోస్టు చేసింది. నమ్రత తండ్రి కొన్నేళ్ల కిందటే మరణించారు. అయితే తన తండ్రి అంటే నమ్రతకు అమితమైన ప్రేమ ఉంది.
Also Read: K.G.F Chapter 2: ‘కేజీఎఫ్ 2’లో బాలీవుడ్ బ్యూటీ ప్రత్యేక సాంగ్ !

అందుకే, తన తండ్రి పుట్టినరోజు నాడు ఆయన జ్ఞాపకార్ధంగా ఆమె ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మహేష్ కి కూడా నమ్రత తండ్రి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం అట. మొత్తానికి నమ్రత తన తండ్రి పై తనకున్న ప్రేమను ఆమె బయటపెట్టారు. దీంతో నమ్రత ఉత్తమ కూతురు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తమ్మీద ఎమోషనల్ అయిన మహేష్ బాబు వైఫ్ అంటూ నెటిజన్లు కూడా ఆమె పోస్ట్ ను బాగా వైరల్ చేస్తున్నారు.
ఏది ఏమైనా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట మొదటి ప్లేస్ లో ఉంటుంది. పైగా ఈ టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అన్నట్టు నమ్రత గత వారం తన పుట్టినరోజును జరుపుకుంది.
Also Read: అనుపమ కడుపు చూసి షాక్ అయిన కమెడియన్ !