Cinema Gossips: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఇండియన్ ఆర్మీకి సీనియర్ హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్నాడు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోందని, ఈ వివాదం పరిష్కారం లభించిన వెంటనే.. స్వయంగా అందరికీ తెలియజేస్తానన్నాడు. దయచేసి అప్పటి వరకు ఇటువంటి వార్తలను నమ్మవద్దన్నాడు సుమన్.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన తెలుగు వెబ్ సిరీస్‌ల్లో ‘30 వెడ్స్ 21’ ఒకటి. 6 ఎపిసోడ్ల సమాహారంగా 2021లో సీజన్- 1 విడుదలై కొత్త అనుభూతిని పంచింది. ఎప్పుడెప్పుడు సీజన్ 2 వస్తుందా? అని ఎదురుచూసిన వారికి శుభవార్తను వినిపించింది నిర్మాణ సంస్థ చాయ్ బిస్కెట్. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సీజన్- 2ను విడుదల చేయనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ టీజర్‌ను పంచుకుంది.
Also Read: ఈ బడ్జెట్ లో ఏ వర్గాలకు న్యాయం? ఏఏ వర్గాలను ఆదుకోబోతోంది..?

ఇక మరో అప్ డేట్ కి వస్తే.. ఓ చిన్న లెక్చరర్ గా జీవితం మొదలుపెట్టి, సినీ ప్రపంచంలో ధ్రువ తారగా పేరు తెచ్చుకొని గిన్నిస్ బుక్ లో స్థానం సాధించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం పుట్టినరోజు. 1250 సినిమాలకు పైగా నటించి ప్రత్యేకమైన హాస్యపు సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు బ్రహ్మి.

ఈయన కేరియార్ లో అరడజన్ నందులు, ఓ ఫిలిం ఫేర్, మూడు సైమా అవార్డులు, ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్న బ్రహ్మానందానికి మా ఓకేతెలుగు నుంచి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
Also Read: తగ్గేదే లే అంటూనే తగ్గిన ఉద్యోగులు.. ప్రభుత్వంతో చర్చలకు జై..