Sreeleela: టాలీవుడ్ కి ఎప్పటినుంచో ఉన్న ఆచారం ఏమిటయ్యా అంటే.. కథల్లో కొత్తదనం లేకపోయినా నటీమణుల విషయంలో మాత్రం నిత్యం కొత్తదనం కావాలి. అందుకే, ప్రతి సంవత్సరం తెలుగు తెర పై కనీసం డజను మంది కొత్త భామలు గ్లామర్ ప్రపంచంలోకి అందాల ఆరబోతకు రెడీ అవుతారు. కాకపోతే ఎంత ఆరబోసినా వాళ్ళల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఉండలేరు. కానీ, కొంతమంది మాత్రం మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకుంటారు. ఆ కోవలోకే వస్తోంది శ్రీలీల.

శ్రీలీల ‘పెళ్ళిసందD’ అనే చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో శ్రీలీల తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ.కోటి డిమాండ్ చేస్తోందట. అమ్మడు అంత డిమాండ్ చేసినా మేకర్స్ డబ్బులు ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, విచిత్రంగా ఆసక్తి చూపించినా.. అమ్మడు డేట్లు దొరకడం లేదు.
Also Read: మెగాస్టార్ కుమార్తె ‘శ్రీజ’ తన భర్త పై సంచలన పోస్ట్
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో మూడు సినిమాలకు ఓకే చెప్పింది. వీటిలో రవితేజ, నవీన్ పోలిశెట్టి హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాల్లో ఏ ఒక్క మూవీ హిట్టైనా శ్రీలీల స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే. ఇప్పుడు శ్రీలీల రూ.కోటి కావాలి అంటుంది. అప్పుడు 2 కోట్లు కావాలి అంటుంది. అది ఆమె రేంజ్. అయినా ఈ రోజుల్లో ఏ కొత్త హీరోయిన్ లో ఏ కోణంలోనైనా మ్యాటర్ ఉంది అని అనిపిస్తే చాలు.. అందరి చూపు ఆమె వైపుకి వెళ్లిపోతుంది.

ఎంతైనా, పెళ్లి సందడి అనే డిజాస్టర్ సినిమాతో తెరంగేట్రం చేసి తన డాన్సుల్లో ఈజ్ చూపించి కుర్రాళ్ళ మతి పోగొట్టింది ఈ యంగ్ బ్యూటీ.
Also Read: ఏపీలో ‘చలో విజయవాడ’ టెన్షన్.. మోహరించిన ఉద్యోగులు, పోలీసులు.. ఏం జరుగనుంది?