Samantha: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఐతే, ఆ ఆశలు, ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉంటాయి. అయినా.. తనకు ఆ కష్టాలు ఏమి కొత్త కాదు అంటుంది ఈ క్రేజీ బ్యూటీ. గతంలో తన జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక కష్టాలు ఉన్నాయని సామ్ తాజాగా ఎమోషనల్ అవుతూ చెప్పింది.

సమంత తన గత బాధల గురించి వివరిస్తూ.. ‘నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు కష్టాలను అనుభవించాను. రోజుకు రూ.500 కోసం పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్ లకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా కూడా పనిచేశాను. ఓ సమయంలో అయితే, డబ్బుల్లేక నేను చదువు కూడా మానేయాల్సి వచ్చింది. అలాగే ఒక పూట భోజనంతో 2 నెలలు గడిపాను.
Also Read: నేడు మోడీ రాక.. సమతమూర్తి రామనుజ విగ్రహావిష్కరణ.. ఇక్రిసాట్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ఇక పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేద్దామంటే.. నీకిది అవసరమా? అని కుటుంబ సభ్యులు వెనక్కి లాగే ప్రయత్నం చేశారు’ అంటూ సామ్ ఎమోషనల్ గా తన బాధల గురించి మొత్తానికి అందర్నీ కదిలించింది. సమంత ఈ మధ్య ‘సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్’ అనే కార్యక్రమమంలో కూడా పాల్గొని ఇలాగే ఎమోషనల్ అవుతూ జీవితానికి సంబంధించి మంచి విషయాలు పంచుకుంది.
ఇంతకీ సమంత ఏమి మాట్లాడింది అంటే.. ‘ఎవరి జీవితం అద్భుతంగా ఉందడు. నేను కూడా జీవితంలోనూ ఎన్నో రకాల మానసిక ఇబ్బందులు అనుభవించాను. అయితే, నాకు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలబడ్డారు. నువ్వు వైద్యుల సాయం తీసుకోవాలని వాళ్లే నాకు సూచించారు. నేను ఈ రోజు ధైర్యంగా నిలబడేందుకు నాకు ఎందరో సాయం చేశారు.

కానీ, జీవితంలో నేను కూడా చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నాను’ అంటూ సమంత ఎమోషనల్ అవుతూ తెలియజేసింది. ఏది ఏమైనా 2021 వ సంవత్సరం సమంతకు చేదు అనుభవాలు మిగిల్చింది. ఆమెను 2021లో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. మానసిక ప్రశాంత కోల్పోవడంతో పాటు సమంత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వాటి నుంచి బయట పడింది.
Also Read: విశాఖలో మనిషిని మింగిన చేప.. వైరల్