Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: 'ఖిలాడీ' సెన్సార్ పూర్తి అయింది !

Ravi Teja: ‘ఖిలాడీ’ సెన్సార్ పూర్తి అయింది !

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఈ సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను విడుదల కానుంది. కాగా తాజాగా ఈ రోజు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని CBFC నుండి U/A సర్టిఫికేట్ పొందింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అంచనాలను పెంచగా.. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

Ravi Teja
Ravi Teja

‘ఖిలాడీ’లో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర అదిరిపోతుందని పైగా అర్జున్ ది కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ఖిలాడీ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ తో రవితేజ బాగా ఆకట్టుకున్నాడు.

Also Read: సిలిండర్ బుకింగ్‌పై రూ.75 డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఏ విధంగా అంటే?

ముఖ్యంగా ఫుల్ కిక్కు అనే సాంగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కూడా ఈ సాంగ్ ను ఫుల్ గా షేర్ అండ్ లైక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఎక్కించింది. సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా బలంగా ఉంటుందట.

raviteja-movie-khiladi-movie-udpates
raviteja-movie-khiladi-movie-udpates

కాగా ఈ సినిమాలో నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సినిమా పై అంచనాలు కూడా బాగున్నాయి.

Also Read: మీకు ఈ నాలుగు చెడ్డ అలవాట్లు ఉన్నాయా.. ఆర్థికంగా స్థిరపడలేరట!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular