Good Luck Sakhi Telugu Movie Review: రేటింగ్ : 2/5
నటీనటులు: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు.
దర్శకత్వం: నగేష్ కుకునూర్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో జగపతి బాబు, ఆది పినిశెట్టి ఇతర కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మించారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
సఖి (కీర్తి సురేష్) ఒక సాధారణమైన అమ్మాయి. చిన్నప్పటి నుంచి ఆమెకు మంచి గురి ఉంటుంది. దూరంగా ఉండే వాటిని కరెక్ట్ గా గురి చూసి కొట్టగొలదు. సఖి స్నేహితుడు గోళీ రాజు ( ఆది పినిశెట్టి) అది గమనించి చిన్నతనం నుంచే ఆమె టాలెంట్ ను ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయడానికి ఆ ఊరు వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సఖి టాలెంట్ ను గుర్తించి ఆమెను షూటర్ ను చేస్తాడు. షూటర్ గా సఖి తన ప్రత్యర్థులను తట్టుకుని ఎలా నిలబడింది ? చివరకు నిలబడి విజేతగా ఎలా నిలిచింది ? మొత్తంగా అతి సాధారణ అమ్మాయి షూటర్ గా ఎలా ఎదిగింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
అతి సాధారణ అమ్మాయి షూటర్ గా ఎలా ఎదిగింది ? ఈ మధ్యలో ఆమె జర్నీ ఎలా సాగింది ? అనే కోణంలో రివీల్ అయ్యే ట్విస్ట్ లు, ఎమోషన్స్ అలాగే కీర్తి సురేష్ క్యారెక్టర్ ఎలివేషన్స్ బాగున్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మలుపులు, మరియి ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే లవ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలిచాయి.
అయితే, ‘గుడ్‌లక్ సఖి’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాదాసీదాగానే సాగుతుంది. ఎక్కడా ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు కనిపించవు. కీర్తి, ఆది పినిశెట్టి, జగపతిబాబు తమ పాత్రలకు న్యాయం చేసినా.. స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కించడంలో డైరెక్టర్ నగేశ్ కుకునూర్ విఫలమయ్యాడు.
అయితే, రఘుబాబు, రాహుల్ రామకృష్ణ కామెడీ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్వించాయి. కాకపోతే సినిమా మెయిన్ కథాంశం బాగున్నా.. సినిమాలో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగాయి.
దర్శకుడు మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథ కథనాన్ని రాసుకోలేదు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. గొప్పగా టీమ్ వర్క్ కూడా ఏమి లేదు.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !
ప్లస్ పాయింట్స్ :
కీర్తి సురేష్, అది పినిశెట్టి, మిగిలిన నటీనటులు నటన,
క్లైమాక్స్,
సంగీతం,
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ నేటివిటీలో రెగ్యులర్ ప్లే ఉండటం.
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
సినిమా చూడాలా ? వద్దా ?
స్పోర్ట్స్ డ్రామా టోన్ తో సాగే సస్పెన్స్ అండ్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ : ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఒకసారి చూడోచ్చు. కాకపోతే, లాజిక్ లెస్ డ్రామాకి పరాకాష్టగా ఉండే ఈ సినిమా.. నేటి డిజిటల్ జనరేషన్ కి మరియు ఓటీటీ ప్రేక్షక లోకానికి మాత్రం నచ్చదు.
Also Read: నీ చల్లని దీవెనలు మరు జన్మలకు కావాలి – మెగాస్టార్ చిరంజీవి