OTT : నెట్‌ ఫ్లిక్స్ నుంచి వారికీ బంపర్ ఆఫర్ !

Netflix India : నెట్‌ ఫ్లిక్స్ అప్ కమింగ్ డైరెక్టర్లకు  మంచి అవకాశాన్ని కల్పించబోతుంది.   టాలెంట్ హంట్ అంటూ  షార్ట్‌ ఫిల్మ్ తీసే ఛాన్స్  ను ఇస్తోంది.  నిజంగానే   షార్ట్ ఫిల్మ్ మేకర్లకు నెట్‌ ఫ్లిక్స్ ఇస్తున్న గొప్ప  సదవకాశం  ఇది.   టేక్‌ టెన్ పేరిట వర్క్ షాప్, పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే మై ఇండియా అంశంపై 2 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ ను మొబైల్‌ తో తీసి నెట్‌ ఫ్లిక్స్‌ కు పంపాల్సి ఉంది.  […]

Written By: Raghava Rao Gara, Updated On : January 25, 2022 12:15 am

OTT Platform

Follow us on

Netflix India : నెట్‌ ఫ్లిక్స్ అప్ కమింగ్ డైరెక్టర్లకు  మంచి అవకాశాన్ని కల్పించబోతుంది.   టాలెంట్ హంట్ అంటూ  షార్ట్‌ ఫిల్మ్ తీసే ఛాన్స్  ను ఇస్తోంది.  నిజంగానే   షార్ట్ ఫిల్మ్ మేకర్లకు నెట్‌ ఫ్లిక్స్ ఇస్తున్న గొప్ప  సదవకాశం  ఇది.   టేక్‌ టెన్ పేరిట వర్క్ షాప్, పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే మై ఇండియా అంశంపై 2 నిమిషాల షార్ట్‌ ఫిల్మ్‌ ను మొబైల్‌ తో తీసి నెట్‌ ఫ్లిక్స్‌ కు పంపాల్సి ఉంది. 

కాగా  ఫిబ్రవరి 7 నుంచి రిజిస్ట్రేషన్ ఆరంభమవుతుంది. ఎంపికైనవారు రైటింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్‌ ల గురించి నేర్చుకునే అవకాశాన్ని ఉచితంగా  పొందొచ్చు.   అలాగే  10 వేల డాలర్లతో షార్ట్‌  ఫిల్మ్ రూపొందించే ఛాన్స్ దక్కుతుంది. మరి   నెట్‌ ఫ్లిక్స్ టాలెంట్ హంట్  కోసం పోటీ పడే కొత్త తరం డైరెక్టర్లు అంతా గెట్ రెడీగా ఉండండి.  షార్ట్‌ ఫిల్మ్ తీసే ఛాన్స్ ను అందుకుని,  ఆ తర్వాత సినిమా ఛాన్స్ ను కూడా పట్టేయండి.  

అన్నట్టు నెట్‌ ఫ్లిక్స్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.   బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో నిర్మిస్తున్న సిరీస్‌ ను నెట్‌ ఫ్లిక్స్ పక్కనపెట్టింది. రూ. 150 కోట్లు ఖర్చుతో చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత ఫైనల్ అవుట్‌ ఫుట్ సరిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తోంది.  మరి  చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ది రైజ్ ఆఫ్ శివగామి, చతురంగ, క్వీన్ ఆఫ్ మాహిష్మతి నవలల ఆధారంగా ఆనంద్ నీలకంఠన్, దేవకట్టా ఈ సిరీస్‌ ను  సిద్ధం చేసిన విషయం తెలిసిందే.