Sai Abhyankkar: సౌత్ ఇండియా లో ప్రస్తుతం నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు అనిరుద్(Anirudh Ravichandar). కుర్ర హీరోల దగ్గర నుండి, సూపర్ స్టార్స్ వరకు ప్రతీ ఒక్కరికి అనిరుద్ మ్యూజిక్ కావాలి. ఆయన డేట్స్ కోసం ప్రయత్నాలు చేసి, దొరకకపోవడం తో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నారు. అంత బిజీ గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అయితే అనిరుద్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ లో ఎంతో మంది ఉన్నారు. అవకాశాలు రాక తమ టాలెంట్ ని ఇప్పటి వరకు చూపించుకోలేకపోయారు. కానీ ఒక్కసారి వాళ్ళ టాలెంట్ బయటపడిన తర్వాత ఇక అవకాశాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వస్తాయి. ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సాయి అభయంకర్ కూడా చేరిపోయాడు.
ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఇన్ని రోజులు యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన సాయి అభయంకర్(Sai abhyankar), రీసెంట్ గా విడుదలైన ‘డ్యూడ్’ చిత్రం తో మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు. యూత్ ఆడియన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలే వింటున్నారు. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలతో ఎడిటింగ్స్ చేస్తున్నారు. గతంలో అనిరుద్ కి మాత్రమే ఇలాంటివి జరిగేవి. ఇప్పుడు సాయి అభయంకర్ కి మొదటి సినిమాతోనే అవన్నీ జరుగుతున్నాయి. చూస్తుంటే రాబోయే రోజుల్లో సాయి అభయంకర్ అనిరుద్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు సాయి అభయంకర్ తనని తాను నిరూపించుకుంటూ అద్భుతమైన మ్యూజిక్ ని అందిస్తే, అతని పేరు దేశం మొత్తం మారుమోగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ యంగ్ సెన్సేషన్ మరో అనిరుద్ కాబోతున్నాడా లేదా అనేది.