Flim Industry: పేరుకు కమల్‌హాసన్ కూతురైనా.. కెరీర్లో సొంతంగా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతిహాసన్. క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ.. వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో శ్రుతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భామ నందమూరి బాలకృష్ణ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా రానున్న సంగతి తెలిసిందే.

అయితే, ముందుగా ఈ సినిమాకు హీరోయిన్గా తమన్నను అనుకున్నాడట గోపిచంద్. అయితే, మిల్కీ బ్యూటికి ప్రస్తుతం డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఈ ఆఫర్‌ను తిరస్కరించిందని సమాచారం. ఆ తర్వాత శ్రుతిహాసన్‌కు చెప్పి.. ఇందులో హీరోయిన్గా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
మరోవైపు, మెగాస్టార్ నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, ఇందులో మెహర్ మొదట శ్రుతి హాసన్‌ను హీరోయిన్గా అనుకున్నాడు. అయితే, తమిళ్ వేదాళంలోనూ శ్రుతి నటించిన సంగతి తెలిసిందే.
దీనికి తోడు ప్రస్తుతం ఫుల్ షూట్స్‌లో బిజీగా ఉండటం వల్ల చిరు సినిమాకు శ్రుతి నో చెప్పిందట. ఇలా ఈ ముద్దుగుమ్మలు.. ఓ స్టార్ హీరోకి నో చెప్పి.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాలయ్య అకండ సినిమాలో బిజీగా ఉన్నారు. మరోవైపు మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యారు. దీంతో పాటు, గాడ్‌ఫాదర్ సినిమాలోనూ నటిస్తున్నారు.