Homeఎంటర్టైన్మెంట్Intinti Gruhalakshmi Serial: విలువైన బహుమతితో అక్షర మనసు గెలుచుకోవాలనుకుంటున్న లాస్య!

Intinti Gruhalakshmi Serial: విలువైన బహుమతితో అక్షర మనసు గెలుచుకోవాలనుకుంటున్న లాస్య!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కుటుంబ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులకు మంచి అభిమానం గా మారింది. ఇక ప్రేమ్ అక్షరతో పెళ్లికి ఒప్పుకోవడంతో తులసి, శృతి బాధలో కుమిలిపోతారు. మరోవైపు నందు సంతోషంతో పొంగిపోతూ హడావుడిగా ఉంటాడు. ఈరోజు జీకే వాళ్లు పెళ్లి చూపులకు వస్తున్నారు అంటూ ఇంట్లో తొందర పెడుతూ ఉంటాడు. తులసి దగ్గరికి వచ్చి త్వరగా పనులు పూర్తి చేయి అనేసరికి తులసి ఇష్టం లేకుండా కోపంతో సమాధానం చెబుతుంది.

Lasya Trying to Impress Akshara with Valuable Gifts

అప్పుడే అనసూయమ్మ వచ్చి తులసిపై అరుస్తుంది. ఇక లాస్య అంకిత దగ్గరికి వెళ్లి రెడీ అవ్వమని చెప్పగా నందు వచ్చి లాస్య తో మాట్లాడతాడు. నువ్వు లేకుంటే ఏం చేయలేక పోయేవాడిని అంటూ లాస్య ను పొగుడుతాడు. ఇక అంకితను రెడీ అవ్వమని చెబుతాడు. తులసి వంట చేస్తుండగా శృతి వచ్చి నేను చేస్తాను ఆంటీ అంటూ అనేసరికి వద్దమ్మా అంటూ బాధతో మాట్లాడుతుంది. ఆ మాటలకు శృతి బాగా ఎమోషనల్ అవుతుంది. ఇక తులసి తన ఆడపడుచు మాధవి కి ఫోన్ చేసి ప్రేమ్ పెళ్లి చూపులకు రమ్మని చెబుతుంది. మాధవి ఎలా రమ్మంటున్నారు అంటూ.. అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావు వదిన అంటూ బాధతో మాట్లాడుతుంది.

అసలు ఎలా ఒప్పుకున్నారు ఒక అత్తగా వాడి ప్రేమను కాదని ఎలా వస్తాను అంటూ కుమిలిపోతుంది. మాధవి ఎంత రాను అని చెప్పినా కూడా తులసి ఎలాగైనా రావాలి అంటూ బ్రతిమాలి గట్టిగా చెబుతుంది. మరోవైపు లాస్య, భాగ్యం సంతోషంగా కనిపిస్తారు. ప్రేమ్ పెళ్లికి ఒప్పుకున్నాడు అంటూ బాగా మురిసిపోతారు. ఇక అక్షర మనసు గెలవడానికి కోసం లాస్య విలువైన డైమండ్ నెక్లెస్ ను బహుమతిగా తీసుకొచ్చింది. భాగ్యం ఆ బహుమతి చూసి షాక్ అవుతుంది. ఇక తరువాయి భాగంలో అక్షర వచ్చి తులసి కాళ్ళు మొక్కడంతో లాస్యకు బాగా మండిపోతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular