వెండితెర పై సాధారణ అమ్మాయిని కూడా అందాల రాశిగా చూపిస్తారు. ఒక్కోసారి అందాల భామను కూడా ముసలి బామ్మగా కూడా చూపించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఓ హీరోయిన్ మేకప్ వ్యవహారం ఇలాగే ఉంది. అయితే, ఈ మార్పు వెనుక కారణం ఆ హీరోయిన్ కాదు, ఆ మ్యాజిక్ కి కారణం ఆమెకు వేసిన మేకపే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే ‘లారా దత్తా’.
ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ‘లారా దత్తా’ గత కొన్ని సినిమాలుగా ఇతర పాత్రలకు పరిమితం అయిపోయింది. అయితే, తాజాగా ఈ బ్యూటీ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. ఇందిరా గాంధీ పాత్రలో ఇప్పటికే చాలామంది నటించారు. కానీ, లారా మాత్రం అచ్చం ఇందిరా గాంధీలా మారిపోయింది.
తాజాగా ఇందిరా లుక్ లో ఉన్న లారా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముఖ్యంగా లారా దత్తా మేకప్ కు ప్రశంసలు లభిస్తున్నాయి. అంత అద్భుతంగా ఆమె తన పాత్రలో ఇన్ వాల్వ్ అయింది. సెట్ లో కూడా ‘లారా దత్తా’ ఇందిరా గాంధీ గెటప్ లో వస్తే.. ఎవరూ ఈమె అనుకున్నారట. అసలు గుర్తుపట్టలేనంతగా ‘లారా దత్తా’ అలా ఎలా ఒదిగిపోయింది ? అంటూ బాలీవుడ్ జనం కూడా కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఒక హీరోయిన్ని మేకప్ తో ఇంతలా మార్చేయ్యొచ్చా ? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందిరా గెటప్ లో ఉన్న ఈమె ఎవరో గుర్తుపట్టలేరని పందెం కూడా కట్టారు పోస్టర్ లీక్ అయినప్పుడు. ఏది ఏమైనా తెరపై నటీనటులను గుర్తుపట్టలేనంతగా మార్చేయగల మ్యాజిక్ ఒక్క మేకప్ కే సాధ్యం. ఇక ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. మరి ఇందిరా గాంధీలా లారా దత్తా ఎలా నటించిందో చూడాలి.