https://oktelugu.com/

Lapata Ladies : ‘లాపతా లేడీస్’ ఆ చిత్రానికి ఫ్రీమేకా..? ఎంతటి మోసం!

Lapata Ladies : సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే స్థాయిలో ఉన్నారు. సినీ నటుడు అయినా, రాజకీయ నాయకుడైన అబద్దాలు చెప్తే వెంటనే దొరికిపోతున్నారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా అభివృద్ధి చెందింది.

Written By: , Updated On : April 2, 2025 / 02:11 PM IST
Lapata Ladies

Lapata Ladies

Follow us on

Lapata Ladies : సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే స్థాయిలో ఉన్నారు. సినీ నటుడు అయినా, రాజకీయ నాయకుడైన అబద్దాలు చెప్తే వెంటనే దొరికిపోతున్నారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా అభివృద్ధి చెందింది. అలా అమీర్ ఖాన్(Aamir Khan) నిర్మాతగా వ్యవహరించిన ‘లాపతా లేడీస్'(Lapata Ladies) చిత్రం నిల్చింది. ఈ సినిమాకు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు(Kiran Rao) దర్శకత్వం వహించింది. 2023 వ సంవత్సరం లో కొత్త వాళ్ళతో చిత్రీకరించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాతిక కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిల్చింది. ఇంత తక్కువ వసూళ్లు వచ్చిన సినిమాని సూపర్ హిట్ అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రానికి అయిన ఖర్చు కేవలం నాలుగు కోట్ల రూపాయిలు మాత్రమే కాబట్టి. థియేటర్స్ లో కంటే ఓటీటీ లో ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుంది.

Also Read : పాన్ వరల్డ్ షేక్ అయ్యే మల్టీస్టారర్ ని ఫిక్స్ చేసిన అల్లు అర్జున్!

నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం దాదాపుగా 9 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్నే లో ఉత్తమ చిత్రం క్రిటిక్స్ క్యాటగిరీ లో అవార్డుని కూడా అందుకుంది. అంతే కాకుండా 25వ IIFA అవార్డ్స్ లో అన్ని కీటగిరీలలోను అవార్డ్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ చిత్రం నిజమైన స్టోరీ తో తెరకెక్కింది అనుకుంటే పెద్ద పొరపాటే. ‘లాపతా లేడీస్’ చిత్రం ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిలిం స్టోరీ ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించారని. ఇదొక ఫ్రీ మేక్ మూవీ అంటూ రెడ్దిట్ యూజర్ ఒకరు బహిరంగంగా పోస్టు చేస్తూ ఆరోపించాడు. అంటే అమీర్ ఖాన్, ఆయన మాజీ సతీమణి కిరణ్ రావు ఈ కథని దొంగలించి చేశారా?, చేసినా చేసి ఉండొచ్చు, ఇలాంటివి వాళ్లకు కొత్త కాదులే అంటూ ఆ యూజర్ సెటైర్లు కూడా వేశాడు.

అయితే ఈ విషయాన్ని కాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే, అమీర్ ఖాన్ టీం ఈ మూవీ కథని బీప్లాబ్ గోస్వామి నుండి అధికారికంగా కొనుగోలు చేసి తెరకెక్కించారని తెలుస్తుంది. సదరు నెటిజెన్ చెప్పుకొచ్చిన ‘బుర్ఖా సిటీ’ షార్ట్ ఫిలిం కి కథని అందించిన బీప్లాబ్ గోస్వామి నే. సినిమాలో కూడా ఆయనకు క్రెడిట్స్ ని అందించారు మేకర్స్. అదే విధంగా ‘లాపతా లేడీస్’ స్టోరీ రైటర్ గా బీప్లాబ్ గోస్వామి కి IIFA అవార్డు కూడా దక్కింది. కాబట్టి ఈ చిత్రం ‘బుర్ఖా సిటీ’ కి ఫ్రీ మేక్ కాదు, రీమేక్ అనే చెప్పాలి. అయితే రీమేక్ అని విడుదలకు ముందు ఎలాంటి ప్రచారం బయటకు రాకపోవడం, ఇప్పుడు అకస్మాత్తుగా ‘బుర్ఖా సిటీ’ షార్ట్ ఫిలిం ని చూడడం వల్ల, ఇది ‘లాపతా లేడీస్’ సినిమా లాగే ఉందే?, ఇక్కడి నుండి కాపీ కొట్టారా అని అనిపించొచ్చు.

Also Read : ప్రభాస్ ఆఫీస్ PRO పై పోలీస్ కేసు నమోదు..కారణం ఏమిటంటే!