lal singh chaddha first day collections: ఇండియన్ సినిమాలో ఆమిర్ ఖాన్ కి ఓ రేంజ్ ఉంది. అమీర్ సినిమా రిలీజవుతుందంటే చాలు బాక్సాఫీస్ కొన్ని రోజుల వరకూ కళకళలాడుతూనే ఉంటుంది. దంగల్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీని అందించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.

Also Read: Patriotism: దేశంలో దేశభక్తే ఇప్పుడు రాజకీయ సరుకు..
కానీ అది అంతా గతం అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. నాలుగేళ్ల తర్వాత లాల్ సింగ్ చడ్డా క్యారెక్టర్‌లో కనిపించిన అమీర్ తీవ్రంగా నిరాశపరిచాడు. లాల్ సింగ్ చడ్డా మూవీ దారుణమైన కలెక్షన్లు రాబట్టింది. ఆమిర్ రేంజ్‌కు ఏమాత్రం తగని ఓపెనింగ్స్ ఇవి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా లాల్ సింగ్ చడ్డా వసూలు చేసిన మొత్తం కేవలం రూ.11 కోట్లు మాత్రమే. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్ అయిన ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ రివ్యూలు కూడా రాలేదు. అసలు ప్రతి సినిమాకు తానే బలంగా నిలిచే ఆమిర్.. ఈ మూవీకి మాత్రం పెద్ద మైనస్ అన్నవాళ్లు కూడా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా తొలి రోజు ఈ మూవీకి సగటున కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండటం ఆమిర్‌కు మింగుడు పడని విషయం. బాక్సాఫీస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈ మూవీ మొత్తంగా రూ.10 నుంచి రూ. 11 కోట్లు మాత్రమే రాబట్టింది.

అటు లాల్ సింగ్ చడ్డాతోపాటు రిలీజైన అక్షయ్ కుమార్ రక్షా బంధన్ మూవీ కూడా తొలి రోజు రూ.10 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు కూడా పూర్తిగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అసలే కొన్నాళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న బాలీవుడ్.. లాల్ సింగ్‌పై భారీ ఆశలే పెట్టుకున్నా.. తొలి రోజు మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే రానున్నది లాంగ్ వీకెండ్ కావడంతో వసూళ్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. శని, ఆదివారాలతోపాటు సోమవారం ఇండిపెండెన్స్ డే హాలీడే కూడా ఉన్న విషయం తెలిసిందే.