Kamal Haasan Sridevi: సినిమాల్లో నటించిన చాలా మంది హీరో, హీరోయిన్లు నిజజీవితంలో ఒక్కటయ్యారు. ఆ తరువాత కొందరు విడిపోయారు.. మరికొందరు కలిసున్నారు. వెండితెరపై పాపులర్ జంటగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్, శ్రీదేవి కూడా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు ఇటీవల హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా సాధ్యం కాలేదు. ఇంతకీ వీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా..? మరి ఎందుకు చేసుకోలేదు..?
Kamal Haasan Sridevi
ఆకలి రాజ్యం…వసంతకోకిల.. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.. సినిమాల పేర్లు ఎత్తగానే గుర్తుకొచ్చేది కమలాసన్, శ్రీదేవి జంట. ఇవే కాకుండా వీరు జంటగా నటించిన చాలా సినిమాలు విజయవంతంగా నడిచాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ హెట్ ఫెయిర్ నటించింది. సంగ్మా అనే హిందీ సినిమాలో కలిసి నటిచింది. అయితే ఇలా పలు సినిమాల్లో నటించిన వీరిని చూసి కొందరు నిజ జీవితంలో కూడా కలిసుంటే బాగుండునని అనుకున్నారట. వారు అనుకున్న విధంగానే శ్రీదేవి తల్లి కమల్ హాసన్ ను పెళ్లి చేసుకొమ్మని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ చెప్పారు.
Kamal Haasan Sridevi
శ్రీదేవి మరణించిన తరువాత ఆమెకు నివాళిని అర్పించే క్రమంలో కమల్ ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్, శ్రీదేవిల మధ్య ఉన్న అనుబంధాన్ని అందులో ప్రస్తావించారు. అలాగే శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి తనను అడిగిందన్న విషయాన్ని కూడా తెలిపారు. అయితే అందుకు కమలాసన్ ఒప్పుకోలేదట. తాను ఎందుకు శ్రీదేవిని పెళ్లి చేసుకోలేదో ఆమె తల్లికి వివరించాడట.
Kamal Haasan Sridevi
‘నేను, శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటంచాం. కానీ నేను శ్రీదేవిని ఎప్పుడూ ఒక సొదరిలాగే ట్రీట్ చేశా. నాకెప్పుడు శ్రీదేవిని పర్సనల్ లైఫ్ లోకి తీసుకోవాలని అనుకోలేదు. శ్రీదేవి కూడా నన్ను సార్ అని పిలిచేది. తను నాకు ఎంతో గౌరవం ఇచ్చేది. ఇలా ఒకరికొకరం గౌరవంగా పిలుచుకునేవాళ్లమే..కానీ పెళ్లి చేసుకునేంతగా చనువు లేదు. అందువల్ల నేను శ్రీదేవిని పెళ్లి చేసుకోలేను’ అని కమల్ హాసన్ చెప్పాడట.
Kamal Haasan Sridevi
Also Read: Lakshya: ‘లక్ష్య’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులు వీరే
దీంతో నిజజీవితంలో కమల్, శ్రీదేవి ఒక్కటి కాలేకపోయారు. అయితే సిల్వర్ స్క్రీన్ పై వీరి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. ఎర్రగులాబీలు వంటి సినిమాల్లో ఫుల్ రొమాన్స్ తో నటించేవారు. మిగతా హీరోల కంటే శ్రీదేవితో కమల్ హాసన్ ఎక్కువగా చనువుగా ఉండేవాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్. కాగా ఆ తరువాత శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Lakshmi Rai: ధోనీతో బ్రేకప్‌పై నటి లక్ష్మీ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kamal Haasan Sridevi