తమిళ నటుడు విక్రమ్ ప్రభు తాజా చిత్రం ద్వారా ఇద్దరు ముద్దుగమ్మలు రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తమిళం, తెలుగు, కన్నడ సినిమాల్లో శ్రీవిద్య, లక్ష్మీమీనన్ నటించి మెప్పించారు. పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ ముద్దుగుమ్మలు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా శివాజీ గణేషణ్ మననువడు విక్రమ్ ప్రభు తాజాగా నటించే మూవీలో వీరిద్దరు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ మూవీని సుశీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. కుటుంబ కథతో తెరకెక్కనున్న ఈ మూవీని నల్లుసామి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తుంది
శ్రీవిద్య, లక్ష్మీమీనన్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించారు. లక్ష్మీమీనన్ అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. తెలుగులో ‘గజరాజు2, ‘ఇంద్రుడు’ వంటి మూవీల్లో నటించింది. అలాగే ఆమె నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి విజయంతంగా ప్రదర్శించబడ్డాయి. అలాగే తెలుగమ్మాయి శ్రీవిద్య తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, కన్నడంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. శ్రీవిద్యకు కుర్రకారులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
లక్ష్మీమేనన్ చివరగా ‘రెక్క’ చిత్రంలో నటించింది. ఈ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. శ్రీదివ్య ‘సంగిలి బుంగిలి కదవ తొర’ చిత్రంలో కనిపించింది. పక్కింటి అమ్మాయి, హోమ్లీ పాత్రలతోనే తమిళ, తెలుగు ప్రేక్షకుల దగగ్గరైన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా గ్లామర్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే మూవీతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.