Lakshmi manchu request to India US embassy about visa issue
Lakshmi Manchu: మంచు లక్ష్మి సహాయం కోసం అర్థిస్తోంది. ఈ మేరకు ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టం ఏమిటో చూద్దాం… మంచు లక్ష్మి అమెరికాలో చాలా కాలం ఉన్నారు. అక్కడే ఆమె సరోగసి పద్దతిలో ఓ పాపకు జన్మనిచ్చినట్లు సమాచారం. దానితో మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణకు అమెరికన్ సిటిజెన్షిప్ ఉంది. విద్య నిర్వాణ అమెరికాలో చదువుకుంటుంది. కాగా ఆమె స్కూల్ హాలిడేస్ ముగిశాయట. తిరిగి ఆమె స్కూల్ కి వెళ్లాల్సి ఉంది. దాంతో జులై 12న అమెరికా వెళ్లేందుకు మంచు లక్ష్మి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది.
అలాగే ఆమె వీసా ఒక నెల క్రితమే అప్రూవ్ అయ్యిందట. కానీ వీసా ఆమెకు చేరలేదట. అమెరికన్ ఎంబసీని సంప్రదిద్దాం అనుకుంటే సైట్ సర్వర్ పనిచేయడం లేదట. తన సమస్య ఎవరికి చెప్పాలో అర్థం కానీ స్థితిలో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తన గోడు వెళ్లగక్కింది. ఎవరైనా పరిష్కార మార్గం చూపాలని, సహాయం చేయాలని ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టారు.
మంచు లక్ష్మి పోస్ట్ వైరల్ అవుతుంది. మంచు లక్ష్మి అభ్యర్థనకు పలువురు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. సలహాలు ఇస్తున్నారు. ఓ వర్గం మాత్రం ఎప్పటిలానే ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రయాణానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఆందోళన చెందుతున్నట్లు ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అర్థం అవుతుంది. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. అక్కడ ఓ ఖరీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకుంది.
టాలీవుడ్ కి గుడ్ బై చెప్పిన అమ్మడు బాలీవుడ్ లో కెరీర్ వెతుక్కుంటుంది. ముంబైలో మంచు లక్ష్మికి మిత్రులు ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకు చాలా క్లోజ్. రకుల్ సలహా మేరకే ముంబై వచ్చానని మంచు లక్ష్మి గతంలో చెప్పడం విశేషం. మోహన్ బాబు కుమార్తె అయిన మంచు లక్ష్మి కొన్నాళ్లుగా తమ్ముడు విష్ణుకు దూరంగా ఉంటుంది. మోహన్ బాబు పిల్లల మధ్య మనస్పర్థలు రాగా.. విష్ణు, మోహన్ బాబు ఒకవైపు.. మనోజ్, లక్ష్మి మరొకవైపు చేరారు.
Web Title: Lakshmi manchu request to india us embassy about visa issue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com