Laila Khan Life: ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో చెప్పలేము. ఒక్కోసారి హిట్ వచ్చింది అని సంతోషించే లోపే వరుసగా రెండు మూడు పరాజయాలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా అనేక సినిమాలలో నటించింది. కానీ చివరకు ఈమె తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురై కన్ను మూసింది. ఈమె సడన్ మరణంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. నటీనటులు ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ ఉంటారు. కెరియర్ మొదట్లో ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదురుకొని చాలా సమయం తర్వాత సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. వరుస అవకాశాలు కష్టపడి దక్కించుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. కెరీర్ బాగా ఫామ్ లో ఉన్న సమయంలోనే వీరు చేసే కొన్ని పొరపాట్లు కారణంగా చివరకు సినిమా ఇండస్ట్రీకి దూరం కూడా అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా హీరోయిన్ తన తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురి అయ్యింది. ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తన తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఈమె టాప్ హీరోయిన్లలో ఒకరిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈ హీరోయిన్ పేరు లైలా ఖాన్. చిన్న వయసులో రాజేష్ ఖన్నా కి జోడిగా వఫా ఏ డెడ్లీ అనే సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది.
ఇక ఈ సినిమా తర్వాత లైలా ఖాన్ అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది. వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న సమయంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కు వెళ్ళింది లైలా ఖాన్. ఈ వెకేషన్ టూర్ తర్వాత లైలా ఖాన్ తో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా కనిపించకుండా పోయారు. లైలా ఖాన్ తండ్రి అప్పట్లో తన కూతురు మరియు కుటుంబం మొత్తం కనిపించడం లేదంటూ పోలీసులను కూడా ఆశ్రయించారు. కొంతకాలం వెతికిన తర్వాత పోలీసులకు లైలా ఖాన్ తండ్రుల మీద అనుమానం వచ్చింది.
లైలా ఖానా తండ్రిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. హీరోయిన్ లైలా కానీ సవతి తండ్రి పర్వేజ్ లైలా ఖాన్ ను హత్య చేసినట్లు స్వయంగా అంగీకరించాడు. అతను నాసిక్ సమీపంలో ఇగతపురిలో 2011లో హీరోయిన్ లైలా ఖాన్ తో పాటు ఆమె తల్లి శేలినా, కజిన్స్ జార, అజ్మీనా, ఇమ్రాన్, రేష్మాలను కాల్చి చంపినట్లు తేలింది. పోలీసులు ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత పోలీసులు ఆమె సవతి తండ్రి పర్వేజ్ ను అదుపులోకి తీసుకున్నారు.