HIT 2 Movie: సినిమా బలమైన సామాజిక మాధ్యమం అనడంలో సందేహం లేదు. ఒక పాప్యులర్ హీరో మేనరిజం, డ్రెస్సింగ్, డైలాగ్స్, హ్యాబిట్స్ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. సినిమాలో చూపించిన క్రిమినల్ మెథడ్స్ వాడి నేరాలకు పాల్పడిన నేరస్థులు ఉన్నారు. తెరపై కనిపించేది బొమ్మలే, అదంతా నిజం కాదని తెలిసినా మనిషి భావోద్వేగాలకు గురవుతాడు. మనిషిని నవ్వించే, ఏడిపించే, కోపానికి, అసహనానికి గురి చేసే శక్తి సినిమాకు ఉంటుంది. పడి పడి నవ్వే ఆడియన్స్, పక్క చైర్ లో ఉన్న వాళ్లను ఫైట్ సీన్ చూస్తూ బాదే ప్రేక్షకులు ఉన్నారు.

అంతగా సినిమా మనిషి మెదడును ప్రభావితం చేస్తుంది. పాత్రలు ప్రేక్షకుడిని తమలో కలుపుకొని ప్రయాణం చేయిస్తాయి. దీనికి తాజా ఘటన చక్కని ఉదాహరణ. హిట్ 2 మూవీ చూసిన ఒక లేడీ ఆడియన్ తీవ్ర అసహనం, ఉద్రేకానికి గురైంది. అయిందేదో అయ్యింది హిట్ 3 ఇలానే ఉండాలంటూ తన డిమాండ్ వినిపించింది. లేదంటే మర్డర్ చేయడానికి సిద్ధమని సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
సదరు లేడీ అంత కసిగా తయారు కావడానికి హిట్ 2 స్టోరీనే. ఆ మూవీలో ఒక సైకో సీరియల్ కిల్లర్ అమ్మాయిలను పాశవికంగా చంపుతూ ఉంటాడు. అమాయకులైన ఆడపిల్లలు ఒక మగాడి చేతిలో దారుణ హత్యకు గురి కావడం ఆమెకు నచ్చలేదు. తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. థియేటర్ నుండి బయటకు వచ్చిన ఆమె… హిట్ 3 మూవీలో సీరియల్ కిల్లర్ అమ్మాయి కావాలి. ఆమె చేతిలో అబ్బాయిలు చావాలి. నాని నిర్మాత కాబట్టి లేడీ సైకో కిల్లర్ ని పెట్టి సినిమా తీయాలి. లేదంటే నేను మర్డర్ చేసి ఆ సైకో కిల్లర్ ఎలా ఉంటుందో చూపిస్తా… అని ఊగిపోతూ చెప్పింది.

ఆమె ఆవేశం చూస్తే ఏదో నిజంగానే అమ్మాయిలను ఒక అబ్బాయి చంపాడు అన్నట్లుంది. అలాంటి క్రూరులైన అబ్బాయిలపై అమ్మాయి సీరియల్ కిల్లర్ గా వచ్చి పగ తీర్చుకోవాలన్నట్లుంది. ఆ లేడీ కామెంట్స్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోని హిట్ 2 హీరో అడివి శేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడం విశేషం. మరి ఈ లేడీ డిమాండ్ హీరో నాని ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటాడో చూడాలి.
😂😂😂 Champina Champesthundhi…kaani Theater lo. #HIT2 https://t.co/yynfGDV7pI
— Adivi Sesh (@AdiviSesh) December 3, 2022