‘L2 : సీక్వెల్స్ కి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకటి రెండు పరాజయాలు తప్ప, సీక్వెల్స్ అత్యధిక శాతం మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించాయి. గత ఏడాది విడుదలైన ‘పుష్ప 2′(Pushpa 2 Movie), ‘స్త్రీ 2′(Stree 2 Movie) చిత్రాలు అందుకు ఒక బెస్ట్ ఉదాహరణ. రీసెంట్ గా విడుదలైన మోహన్ లాల్(Mohanlal) ‘L2: ఎంపురాన్'(L2: Empuraan) చిత్రం మరో ఉదాహరణగా నిల్చింది. ఈ సినిమాకు పైన ప్రస్తావించిన రెండు సినిమాల రేంజ్ లో పాజిటివ్ టాక్ రాలేదు. చాలా నెగటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. తమిళ వెర్షన్ కూడా కుమ్మేస్తుంది. కానీ తెలుగు లో మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : 48 గంటల్లో 120 కోట్లు..చరిత్ర సృష్టించిన మోహన్ లాల్ ‘L2: ఎంపురాన్’
పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలుగు లో ఈ సినిమాకు విడుదలకు ముందు 6 కోట్ల రూపాయలకు బిజినెస్ జరిగింది. మూడు రోజులకు కలిపి కేవలం కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఫుల్ రన్ లో రెండు కోట్ల షేర్ మార్కుకి చేరవచ్చు. కానీ ఫలితం మాత్రం డిజాస్టర్ అనే చెప్పాలి. కానీ మలయాళం వెర్షన్ లో మాత్రం సునామీ తరహా వసూళ్లు వస్తున్నాయి. నేడు ఈ చిత్రానికి గంటకు బుక్ మై షో యాప్ లో 30 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ మాస్ ర్యాంపేజ్ అనేది. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో క్లుప్తంగా చూడబోతున్నాము. ముఖ్యంగా కేరళలో మూడు రోజులకు గాను ఈ చిత్రానికి 33 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడు లో నాలుగు కోట్ల 60 లక్షలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే సునామీ తరహా వసూళ్లను రాబడుతుంది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మూడు రోజులకు కలిపి 85 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మలయాళం సినిమాలకు మొదటి నుండి ఓవర్సీస్ మార్కెట్ తారా స్థాయిలో ఉంటుంది, ఈ చిత్రానికి అయితే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో 136 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మలయాళం సినీ ఇండస్ట్రీ లో ఇదొక సరికొత్త చరిత్ర, మళ్ళీ ఇలాంటి అద్భుతాలను చూడడం కష్టం.
Also Read : ‘L2 : ఎంపురాన్’ మూవీ ట్విట్టర్ టాక్..ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్ లో ఉందా!