Kushi Trailer: విజయ్ దేవరకొండ సమంత కాంపిటీషన్ లో వస్తున్న ఖుషి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. మజిలీ మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి రొమాంటిక్ మూవీ అని ఇప్పటికే విడుదలైన పాటల్ని పట్టి తెలుస్తోంది. సెప్టెంబర్ 15వ తారీఖున ఈ చిత్రం తెలుగు ,తమిళ్, కన్నడ ,మలయాళం హిందీ భాషలలో గ్రాండ్గా లాంచ్ కాబోతోంది.
రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నారు మూవీ టీం. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. 45 సెకండ్లు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో సమంత ,విజయ్ దేవరకొండ ఎంతో అందంగా కనిపించారు. ఆధ్యంతం ఆసక్తిగా సాగిన ఈ ట్రైలర్ చూసినా అభిమానులు కొంతమంది ఇది అర్జున్ రెడ్డి కి రెఫరెన్స్ లా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
ట్రైలర్ లో సమంత ముస్లిం ,బ్రాహ్మణ అమ్మాయిగా రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తుంది. ట్రైలర్ ను బట్టి ఇంతకీ మతాంతర వివాహం అనేది ఈజీగా అర్థమవుతుంది. విప్లవ, ఆరాధ్య పెద్దలను ఎదిరించే పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎదుర్కొనే సమస్యల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఈ ట్రైలర్ లో ‘భర్త ఎలా ఉండాలో చూపిస్తా’, ‘నేను స్త్రీ పక్షపాతిని’, ‘నా పిల్ల’ లాంటి విజయ్ దేవరకొండ ట్రేడ్ మార్క్ డైలాగ్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
ట్రైలర్ చూసిన ఎవరికైనా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ టైప్ పర్ఫామెన్స్ చూపించాడు అన్న అనుమానం కలుగుతుంది. మెయిన్ గా ట్రైలర్ చివర్లో విజయ్ దేవరకొండ ఒక లేడీ తో ‘ఎందుకు బయపడుతున్నావమ్మా, మార్కెట్లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ, నేను స్త్రీ పక్షపాతిని’అని ఒక డైలాగ్ చెప్తాడు. అయితే ఈ లేడి అర్జున్ రెడ్డి మూవీ లో కూడా ఉంది. ఇకపోతే ‘నా పిల్ల’ అనే డైలాగ్ స్టార్ట్ అయిందే అర్జున్ రెడ్డి తోటి. ఇదే నా పిల్ల డైలాగ్ విజయ్ దేవరకొండ బేబీ మూవీలో వాడాడు. ఈ ట్రైలర్ను గమనించిన నటిజన్స్ ప్రస్తుతం ఈ రెండు విషయాలపై కామెంట్స్ చేస్తున్నారు.
