Kuberaa OTT Release : భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదలై మొదటి ఆట నుండే అల్ట్రా పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్న కుబేర(Kuberaa Movie) చిత్రం, అతి త్వరలోనే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల మార్కుని అందుకోబోతుంది. వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని ఈ సినిమా నమోదు చేసుకుంటుందంటే లాంగ్ రన్ చాలా బలంగా ఉండేట్టు గా అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ తో కుదిరించిన డీల్ కారణంగానే ఈ నెలలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. వారం రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమాకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ఫినిష్ అవ్వలేదు. మొదటి కాపీ సిద్ధం కాలేదు. దీంతో మేకర్స్ వాయిదా వెయ్యాలని చూసారు. కానీ అమెజాన్ ప్రైమ్ అందుకు ఒప్పుకోలేదు.
చెప్పిన డేట్ కి విడుదల చేయకపోతే పది కోట్ల రూపాయిలు కట్ చేస్తామని బెదిరించారు అంటూ ఆ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్(Asian Sunil Narang) ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమా విడుదలైన నాలుగు వారాలకు అమెజాన్ ప్రైమ్ లో విడుదల చెయ్యాలి. అంటే వచ్చే నెల 23 లేదా 25 వ తేదీ లోపు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే సరిగ్గా ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల రోజున ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వబోతుంది అన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ఒకవేళ థియేట్రికల్ రన్ అద్భుతంగా ఉందంటే మాత్రం మరో రెండు వారాలు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. కానీ ఇలా ముందుగానే నాలుగు వారాలకు ఓటీటీ లో విడుదల అవ్వబోతుంది అనే వార్త అందరికీ తెలియడంతో మూడు గంటల నిడివి ఉన్న సినిమాని థియేటర్స్ కి వెళ్లి ఏమి చూస్తాము లే, నాలుగు వారాలు ఓపిక పడితే ఓటీటీ లో విడుదల అవుతుంది, అప్పుడు చూసుకోవచ్చు అనే మూడ్ లోకి ప్రేక్షకులు వచ్చేస్తున్నారు. ఒక సినిమా థియేట్రికల్ రన్ బాగా తగ్గిపోవడానికి ఇదే కారణం అని అంటున్నారు విశ్లేషకులు. కనీసం 8 వారాల గ్యాప్ అయినా ఉంటుందని ఆడియన్స్ కి తెలిస్తే థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆలోచిస్తారని, కానీ మేకర్స్ ఆ దిశగా అడుగులు వెయ్యడం లేదని అంటున్నారు.