Kuberaa Collection: ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇకమీదట రాబోయే సినిమాలతో మన స్టార్ డైరెక్టర్లు ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: మృత్యువు సెంటీమీటర్ దూరంలో ఆగింది.. భూమ్మీద నీకు నూకలు ఉన్నాయి భయ్యా: వైరల్ వీడియో
శేఖర్ కమ్ముల (Shekar Kammula) దర్శకత్వంలో ధనుష్ (Dhanush) హీరోగా నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటించిన కుబేర (Kubera) సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ప్రేక్షకులు థియేటర్లకైతే రావడం లేదు. ఇక ఈ మధ్య కాలంలో సరైన సినిమా రాకపోవడం వల్ల ప్రేక్షకులు ఎవరు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. కానీ ఎట్టకేలకు శేఖర్ కమ్ముల చేసిన కుబేర సినిమాతో ప్రేక్షకులందరు థియేటర్ కు వచ్చి ఈ సినిమాను సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరకంగా థియేటర్ యజమానులు గత కొన్ని రోజుల నుంచి సినిమాల మీద కొంతవరకు వ్యతిరేకతను చూపిస్తున్నారు. ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫామ్స్ చేయడం వల్ల సినిమాలను థియేటర్లో కేవలం 15 నుంచి 20 రోజులు మాత్రమే నడపగలుగుతున్నామని తర్వాత ఓటిటిలో రిలీజ్ చేయడం వల్ల సినిమా థియేటర్లకు భారీగా దెబ్బ పెడుతున్నారని వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి వల్ల వాదనను వినిపిస్తూ వస్తున్నారు. ఇక దానికి తోడుగా ఫ్లాప్ సినిమాలు రావడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు కూడా పెద్దగా రాలేకపోతున్నారు. కాబట్టి థియేటర్లు మూత పడిపోతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే థియేటర్ యజమానులకు ప్రొడ్యూసర్లకు మధ్య కొన్ని సామరస్యమైన మీటింగులైతే జరుగుతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలో కుబేర (Kubera) సినిమా వచ్చి ప్రేక్షకులను మరోసారి థియేటర్ కి రప్పించింది. గత వారం రోజుల నుంచి ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది.
ఒక రకంగా థియేటర్ యజమానుల్లో కొంతవరకు సంతోషాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. మరి ఇకమీదట కూడా రాబోయే సినిమాలన్నీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతూ థియేటర్లు కళకళలాడితే చూడాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
మరి రాబోయే సినిమాలు ఎలాంటి మ్యాజిక్ ను చేస్తాయి. తద్వారా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది. థియేటర్ యజమానులకు ప్రాఫిట్స్ వస్తాయా? రావా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…