Kamal Haasan fined Rs 25 lakh: కమల్ హాసన్(Kamal Haasan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్'(Thug Life) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ సిరీస్ భారీ విజయం సాధించిన తర్వాత మణిరత్నం తీస్తున్న సినిమా కావడంతో పాటు, మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఉండేవి. పైగా ఇందులో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి శింబు కూడా కీలక పాత్ర పోషించడం ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. కనీసం బాక్స్ ఆఫీస్ వద్ద ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా ఈ చిత్రం రాబట్టలేకపోయింది.
ఇలాంటి ఫెయిల్యూర్ కమల్ హాసన్ కెరీర్ లో ఈమధ్య కాలంలో రాలేదు. పైగా కర్ణాటక ఈ సినిమా విడుదలను కమల్ హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా బ్యాన్ చేయడం జరిగింది. దీని వల్ల సినిమాకు పది కోట్ల రూపాయిల నష్టం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారుగా 130 కోట్ల రూపాయలకు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. కానీ విడుదలకు ముందు కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చింది. పూర్తి స్థాయి అమౌంట్ సినిమా ఫలితాన్ని బట్టి ఇస్తారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ తో కుదిరించుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని 8 వారాల తర్వాత విడుదల చెయ్యాలి.
కానీ థియేటర్స్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలవడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ 8 వారాలకు 130 కోట్లు ఇచ్చుకోలేమని, కేవలం 90 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పారట. దీంతో నిర్మాత కమల్ హాసన్ దిగొచ్చి , నాలుగు వారాలకే అన్ని వెర్షన్స్ ని విడుదల చేసుకోండి, డబ్బులు తగ్గించకండి అని రిక్వెస్ట్ చేసాడట. కానీ 20 కోట్ల రూపాయిల కొత్త విధిస్తూ 110 కోట్ల రూపాయలకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ లో మల్టీ ప్లెక్స్ థియేటర్స్ తో కుదిరించుకున్న డీల్ ప్రకారం 8 వారాల వరకు ఓటీటీ లో విడుదల ఉండకూడదు. కానీ కమల్ హాసన్ ఆ రూల్ ని బ్రేక్ చేసాడు. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ కి ఆయన పాతిక లక్షల రూపాయిల జరిమానా కట్టాల్సి ఉంటుంది.