Kuberaa Collection Day 10: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush K Raja) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వర్కింగ్ డేస్ లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసుకుంది. నిన్న కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 70 కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఒకపక్క ‘కన్నప్ప’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పదవ రోజు ఆ చిత్రానికి పోటీ గా నిలిచి సరిసమానమైన టికెట్ సేల్స్ జరిగాయంటే కుబేర చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: కూలీ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్న మరో తెలుగు స్టార్ హీరో..?
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి పదవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఒకవేళ కన్నప్ప లేకుంటే ఈ చిత్రం నాలుగు కోట్ల షేర్ వసూళ్లను కూడా రాబట్టి ఉండేది. దీంతో పది రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటిన ఈ చిత్రం రెండు కోట్ల రూపాయిల లాభాలను ఇప్పటి వరకు అర్జించినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 123 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక తమిళనాడు లో అయితే ఎలాంటి గ్రోత్ లేదు. నిన్నటితో అక్కడ క్లోజింగ్ వేసుకోవచ్చు. ఇప్పటి వరకు కేవలం 19 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే.
ప్రాంతాల వారిగా చూస్తే తెలుగు రాష్ట్రాల నుండి 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి 29 కోట్ల రూపాయిలు, కర్ణాటక నుండి 10 కోట్ల రూపాయిలు, కేరళ నుండి కోటి 30 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 70 లక్షల రూపాయిలు వచ్చాయి. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 66 కోట్ల రూపాయిలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని 2025 వ సంవత్సరం లో క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని అందుకోబోతుంది ఈ చిత్రం. ఫుల్ రన్ లో మరో 20 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయి.