Kubera Vs 8 Vasanthalu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా మంది దర్శకులు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నా కొంతమంది దర్శకులు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా క్లారిటీ గా ఉంటున్నట్టు గా తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల (Shekar Kammula) లాంటి దర్శకుడు ధనుష్ ను హీరోగా పెట్టి చేసిన ‘కుబేర’ (Kubera) సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి టాక్ అయితే వస్తుంది. మరి దాంతో పాటుగా ఫణీంద్ర నరిశెట్టి అనే దర్శకుడు తీసిన ‘ 8 వసంతాలు’ (8 Vasanthalu) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది. మరి ఈ రెండు సినిమాలు కూడా ట్రైలర్లతో ప్రేక్షకులను అలరించాయి. అయితే వీటిలో ఏ సినిమా విజేతగా నిలిచింది. ఏ సినిమా డిజాస్టర్ ని మూటగట్టుకుంది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి కుబేర సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. శేఖర్ కమ్ముల లాంటి టేస్ట్ ఉన్న దర్శకుడు తన రూటు మార్చి మరి ఇలాంటి ఒక సబ్జెక్టుని ఎంచుకొని డీల్ చేసిన విధానం అయితే బాగుంది. ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఉంది.
ఇక 8 వసంతాలు అనే సినిమా ప్రేమలోని ఒక మాధుర్యాన్ని చూపిస్తూ ప్రేమ అంటే ఏంటి అది ఎవరి మీద ఎప్పుడు ఎలా పుడుతుంది ఎందుకు పుడుతుంది అనే వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం మంచి టాక్ ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ రెండు సినిమాలతో వాళ్ళను వాళ్లు మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునేందుకు అవకాశం అయితే దక్కింది. ఇక 8 వసంతాలు సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించడం వల్ల ఈ సినిమాకి మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.
ఆ బజ్ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడానికి సహాయపడుతుందనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాలు లాంగ్ రన్ లో సూపర్ సక్సెస్ సాధిస్తోంది. ఏ సినిమా రెండు మూడు రోజులకే చాప చుట్టేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ రెండు సినిమాలకు మొదటి రోజు ఓపెనింగ్ ఎలక్షన్స్ ఎంత వచ్చాయి అనే విషయాలు తెలియాలంటే ఈరోజు గడవాల్సిందే…