Kubera Movie Dhanush Role: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna),ధనుష్(Dhanush) లను హీరోలుగా పెట్టి శేఖర్ కమ్ముల(Sekhar Kammula) తెరకెక్కించిన ‘కుబేర'(Kubera Movie) చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల సినిమా అంటే ఆడియన్స్ లో మినిమం గ్యారంటీ అనే అంచనాలు ఉంటాయి. పైగా టీజర్, ట్రైలర్ మరియు పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అంచనాలు భారీగా ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి?. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అనుకున్నంత రేంజ్ లో లేవని ట్రేడ్ నుండి వినిపిస్తున్న మాట. కారణం ఏమిటో తెలీదు కానీ ధనుష్ గత చిత్రం ‘సార్’ కంటే ఈ చిత్రానికి ఇటు తెలుగు లో కానీ, అటు తమిళం లో కానీ ప్రోత్సాహకరమైన బుకింగ్స్ లేవు. పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరంగా విషయం తెలిసింది.
అదేమిటంటే ఇందులో ధనుష్ క్యారక్టర్ కోసం ముందుగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ని సంప్రదించారట. విజయ్ దేవరకొండ ఇలాంటి క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని, కచ్చితంగా న్యాయం చేస్తాడని బలంగా నమ్మాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. కానీ ఎందుకో ఆయన ఈ క్యారక్టర్ చేయడానికి ఆసక్తి చూపలేదని, కొత్త హీరో చేయాల్సిన క్యారక్టర్ ని ఒక ఇమేజ్ ఉన్న స్టార్ హీరో చేస్తే కచ్చితంగా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. కేవలం విజయ్ దేవరకొండ ని మాత్రమే కాదు,దుల్కర్ సల్మాన్ ని కూడా అడిగాడట. కానీ ఆయన కూడా ఒప్పుకోలేదు. ఇక చివరికి ఈ స్టోరీ ధనుష్ వద్దకు చేరింది. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ధనుష్ ఎప్పుడూ ముందు ఉంటాడు అనే విషయం మనకు తెలిసిందే.
Also Read: Dhanush : ధనుష్ కోసం ఇంత మంది తెలుగు డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారా..?
తనకు ఎలాంటి ఇమేజ్ ఉంది అనేది అసలు ఆలోచించడు. కేవలం క్యారక్టర్ ని మాత్రమే చూస్తాడట. అందుకే ఈ సినిమాని చేసేందుకు ఆయన క్షణం కూడా ఆలోచించలేదట. మొత్తానికి మంచి క్యారక్టర్ అయితే విజయ్ దేవరకొండ మిస్ అయ్యాడు. ఈ సినిమాని వదులుకొని ఆయన తప్పు చేశాడా?, లేకపోతే మంచి నిర్ణయమే తీసుకున్నాడా అనేది రేపు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తో కలిసి ‘కింగ్డమ్’ అనే చిత్రం లో నటించాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా కొత్త విడుదల తేదీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆగష్టు నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కి పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.