Kritishetty : పైట తీసేసి పరువాలు ప్రదర్శిస్తున్న బేబమ్మ… కృతి శెట్టి గ్లామర్ కేక!

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పరువాల ప్రదర్శన చేస్తుంది. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కృతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Written By: Shiva, Updated On : June 5, 2023 9:25 am
Follow us on

Kritishetty : యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమె డెబ్యూ మూవీ ఉప్పెన భారీ విజయం సాధించింది. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఉప్పెన వసూళ్ల వర్షం కురిపించింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. దర్శకుడు బుచ్చిబాబుకు కూడా మొదటి చిత్రం. ఉప్పెన విజయం కృతికి వరుస ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆమె గ్లామర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ సాంగ్ లో శృంగారం కురిపించి గుండెల్లో సెగలు రేపింది. 

 
అనంతరం శ్యామ్ సింగరాయ్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. నాని హీరోగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ తెరకెక్కింది. ఇక మూడో చిత్రం బంగార్రాజు సైతం హిట్. ఆ దెబ్బతో కృతి శెట్టికి ఎదురులేకుండా పోయింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో ఎడాపెడా సినిమాలకు సైన్ చేసింది. అయితే ఎలా విజయాలు దక్కాయో అలానే పరాజయాలు దక్కాయి. కృతి శెట్టి నటించిన గత నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. 
 
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి నిరాశపరిచాయి. ఇక 2023లో కస్టడీ అంటూ ప్రేక్షకులను పలకరించింది. ఈ ఇంటెన్స్ కాప్ డ్రామా చూసి ప్రేక్షకులు పెదవి విరిచారు. కస్టడీ కృతి ఖాతాలో మరో ప్లాప్ గా మిగిలిపోయింది. దీంతో తెలుగులో కృతికి ఆఫర్స్ దక్కడం కష్టమే అన్నట్లు పరిస్థితి మారింది. 
 
ప్రస్తుతం కృతి మలయాళంలో ఓ మూవీ చేస్తున్నారు. తమిళంలో కార్తీ, విశాల్ పక్కన ఛాన్స్ దక్కిందని ప్రచారం జరుగుతుంది. మరో కన్నడ భామ శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. ఆమె వరుస చిత్రాలకు సైన్ చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పరువాల ప్రదర్శన చేస్తుంది. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కృతి శెట్టి ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.