Tana Mahasabhalu 2023 : ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య ఆకర్షణగా ఇళయరాజా నిలవనున్నారు.
అమెరికాలోని తెలుగువారు ఎందరో ఆయన అభిమానులు…తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన ఇళయరాజా తానా మహాసభల్లో కూడా తన సంగీత కచేరితో మిమ్ములను అలరించనున్నారు. సంగీత ప్రయోగాలకు పేరుగాంచి ఇళయరాజా, తన సింఫనీతో కాన్ఫరెన్స్‌కు వచ్చినవారిని అలరించనున్నారు.
తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి ఇళయరాజాను స్వయంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇళయరాజా రాకతో కాన్ఫరెన్స్‌లో సంగీతహోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయమని అధ్యక్షుడు అంజయ్య చౌదరిలావు అంటున్నారు.
ఈ కార్యక్రమానికి ఇళయారాజాతోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, గాయని చిత్ర, సద్గురు జగ్గీ వాసుదేవ్ ను తానా సభ్యులు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమాన్న తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, కోఆర్డినేటర్ రవి పొట్లూరి దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు.
ఇళయరాజా సంగీతాన్ని ప్రత్యక్షంగా వినాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే తానా మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇతర వివరాలకు చూడండి.