Krithi Shetty remuneration : తొలి సినిమాతోనే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టి కేవలం అందం తో మాత్రమే కాదు, నటనతో కూడా తన విశ్వరూపాన్ని చూపించిన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెన సినిమా తో ఈమె సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో మామూలుది కాదు. ఈ సినిమా ఆమెకి తొలిచిత్రం అంటే ఎవ్వరూ నమ్మరు. విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడి కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చూస్తూ నటించి అందరినీ ఆశ్చర్యపొయ్యేలా చేసింది.
తొలిసినిమాతోనే ఈ రేంజ్ నటన చూపించింది అంటే, భవిష్యత్తులో ఈమె ఎవ్వరూ అందుకోనంత రేంజ్ కి వెళ్తుందని అనుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత ఈ క్యూట్ హీరోయిన్ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. దాంతో ఈమె రేంజ్ ఒక్కసారిగా దారుణంగా పడిపోయింది. ఎవరైతే ఈమెని చూసి గోల్డ్ లెగ్ అన్నారో, ఇప్పుడు వాళ్ళే ఐరన్ లెగ్ అని పిలుస్తున్నారు.
ఉప్పెన సినిమా హిట్టైన తర్వాత ఈ అమ్మడు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్ధం గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈమెకి వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడం మొదలయ్యాయో అప్పటి నుండి ఈమె డిమాండ్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు ఒక్క సినిమాకి ఈమె 20 నుండి 40 లక్షల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఏ స్థాయి నుండి ఏ స్థాయికి పడిపోయిందో అని ఆమె అభిమానులు తెగ ఫీల్ అయ్యిపోతున్నారు, అందుకే అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయకూడదు.
ఒక స్క్రిప్ట్ ఒప్పుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి, లేకుంటే కెరీర్ ఇలాగే తలక్రిందులు అయిపోతుంది. ఈ అమ్మడుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది, కానీ అది డైరెక్టర్స్ కి కనపడడం లేదు, కేవలం సక్సెస్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. సక్సెస్ లేకపోతే విలువ ఉండదు అని పెద్దలు అంటున్న మాట ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడే అర్థం అవుతూ ఉంటుంది.