Kriti Sanon : హీరోయిన్ కృతి సనన్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. 2014లో వన్ నేనొక్కడినే మూవీతో ఆమె సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు సుకుమార్ వన్ నేనొక్కడినే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా ఆడలేదు. మహేష్ బాబు కెరీర్లో మోస్ట్ స్టైలిష్ మూవీగా ఇది ఉంది. వన్ అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో అక్కడకు చెక్కేసింది.
కృతి సనన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సెటిల్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్ మూవీతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ రామాయణ గాధ నిరాశపరిచింది. ఆరు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తే అందులో సగం షేర్ కూడా రాబట్టలేదు. వరుసగా ప్రభాస్ మూడో మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపడింది.

జానకిగా కృతి సనన్ మెప్పించారు. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న కృతి సనన్ సైతం బాడీ షేమింగ్ కి గురయ్యారట. పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రోజుల్లో నీకు హెడ్ లైట్స్ లేవు, డిక్కీ లేదని అనుచిత కామెంట్స్ చేశారట. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన నేను నటి కావాలనుకున్నాను. అయితే కొందరు నా శరీరంలో లోపాలు వెతికి అవమానాలు గురి చేశారని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
బక్కపలచని శరీరంతో ఎత్తుగా ఉండే కృతికి కూడా బాడీ షేమింగ్ తప్పలేదట. అయితే అప్పుడు తనను విమర్శించిన వాళ్లే నటిగా సక్సెస్ అయ్యాక ప్రశంసించారని కృతి సనన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హిందీలో మూడు చిత్రాలు చేస్తుంది. కాగా ప్రభాస్ తో ఆమె ప్రేమలో పడ్డారని పుకార్లు వినిపించాయి. ఈ వార్తలను కృతి సనన్ కొట్టిపారేశారు. ప్రభాస్ మంచి ఫ్రెండ్, అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చింది.