Heroine : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన కృతి సనన్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు రావడం ఆగలేదు. ఆమె అందం, నటన అలాంటిది మరి. టాలీవుడ్ లో 1 నేనొక్కడినే తర్వాత నాగ చైతన్య తో కలిసి ‘దోచేయ్’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు బాగా వచ్చినప్పటికీ, ఆమె తన ఫోకస్ ఎక్కువగా బాలీవుడ్ వైపే పెట్టింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ, సూపర్ హిట్స్ ని అందుకుంటూ పెద్ద రేంజ్ కి వెళ్లిపోవడమే కాకుండా, ఉత్తమనటిగా నేషనల్ అవార్డు ని కూడా సొంతం చేసుకుంది.
ఈమధ్య కాలంలో ఈమె ప్రభాస్ తో కలిసి ‘ఆదిపురుష్’ అనే చిత్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈమె ప్రభాస్ తో క్లోజ్ గా ఉండడం చూసి, అతనితో డేటింగ్ చేస్తుందని, వాళ్ళిద్దరికీ విదేశాల్లో నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు ఒక రేంజ్ లో ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై స్వయంగా ప్రభాస్, కృతి సనన్ స్పందించి అలాంటిదేమి లేదంటూ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కృతి సనన్ ప్రస్తుతం కబీర్ బహియా అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తుంది. వీళ్లిద్దరు ముంబై లో చెట్టాపట్టాలేసుకొని ప్రైవేట్ పార్టీలకు వెళ్తూ అక్కడి మీడియా దృష్టిలో పడ్డారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. రీసెంట్ గానే ఈమె కబీర్ పుట్టినరోజు వేడుకలను తన సొంత ఖర్చులతో గ్రాండ్ గా నిర్వహించింది.
ఈ వేడుకల్లో ఆమె స్టైల్ గా దమ్ము కొడుతూ కొన్ని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. సీత పాత్ర పోషించిన అమ్మాయి, నేషనల్ అవార్డు అందుకున్న నటి, ఇలా సిగరెట్స్ తాగుతూ, వాటిని సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ యువతకు ఏమి సందేశం ఇస్తున్నట్టు అంటూ నెటిజెన్స్ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇది ఇలా ఉండగా శుక్రవారం రాత్రి ఆమె తన ప్రియుడితో కలిసి రెస్టారంట్ కి వెళ్లిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఈ ఏడాది లోనే వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఈమె ‘తేరి బాతోన్ మే ఐసా ఉల్జా జియా’, ‘క్రూ’, ‘డూ పట్టి’ వంటి సినిమాలు చేసింది. ఈ ఏడాది ఆమె కేవలం ‘తేరే ఇష్క్ మైన్’ అనే చిత్రంలో మాత్రమే నటిస్తుంది.