Coolie movie : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు రజనీకాంత్(Rajinikanth)… ఆయన చేసిన సినిమాలకి సపరేట్ గుర్తింపు ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…70 సంవత్సరాల వయసులో కూడా సినిమా మీద ఉన్న ఇష్టంతో తన అభిమానుల కోరిక మేరకు వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… రజినీకాంత్ లాంటి నటులు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు లోకేష్ కనకరాజు(Lokesh Kanakaraj) డైరెక్షన్ లో చేస్తున్న కూలీ (Kuli)సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే కమల్ హాసన్(Kamal Hasan)కి విక్రమ్ (Vikram)సినిమాతో భారీ సక్సెస్ ని కట్టబెట్టిన లోకేష్ కనకరాజు ఇప్పుడు రజనీకాంత్ కి కూడా అలాంటి విజయాన్ని అందించబోతున్నాడు అంటూ రజిని అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రను పోషిస్తూ ఉండడం విశేషం… ఇక ఈ సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడానికి చిరంజీవి(Chiranjeevi) కూడా సిద్ధమయ్యాడు అంటూ గత కొన్ని రోజులుగా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.
రజినీకాంత్ చిరంజీవి మంచి ఫ్రెండ్స్ కాబట్టి రజినీకాంత్ కోరిక మేరకు చిరంజీవి ఈ సినిమాలో ఒక ఐదు నిమిషాల పాటు కనిపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ‘జైలర్ ‘ (Jailer) సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు నటించి ఆ సినిమా భారీ సక్సెస్ సాధించడం లో కీలక పాత్ర వహించారు. అలాగే చిరంజీవి కూడా ఈ సినిమాలో నటించి ఈ సినిమాకి భారీగా బూస్టప్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక లోకేష్ కనకరాజ్ సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీర్చిదిద్దుతున్నాడట. మరి ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు రివిల్ చేయడం లేదు కానీ చిరంజీవి అయితే ఈ సినిమాలో కచ్చితంగా కనిపించబోతున్నాడు అంటూ తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతుంది…