Krithi Shetty : నీలి రంగు బట్టల్లో నెలవంకలా కృతి శెట్టి… బేబమ్మను చూస్తే కళ్ళు తిప్పుకోలేం!

శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హవా శ్రీలీలదే, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చిత్రాలతో కలిపి ఏకంగా 7 సినిమాలు చేస్తుంది. అలాగే ఓ కన్నడ మూవీ కూడా ఉంది

Written By: NARESH, Updated On : July 11, 2023 8:38 pm
Follow us on

Krithi Shetty : చూడగానే కట్టిపడేసే అందం కృతి శెట్టి సొంతం. ఇరవై ఏళ్ళు దాటకుండానే సిల్వర్ స్క్రీన్ పై తన మార్కు చూపించింది. గ్లామర్ ఫీల్డ్ లో ఫోటో షూట్స్ తప్పనిసరి. కృతి శెట్టి సైతం అదే చేస్తున్నారు. తాజాగా నీలి రంగు ట్రెండీ దుస్తుల్లో మనసులు దోచేసింది. కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ తో గుండెలు కొల్లగొట్టింది. చందమామలా ఉన్న కృతి గ్లామర్ మైమరిపిస్తోంది. కృతి శెట్టి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

కృతి శెట్టి కెరీర్ కొంచెం నెమ్మదించింది. పరిశ్రమలో హిట్ మాత్రమే ఒకరి ఫేట్ నిర్ణయిస్తుంది. ఆ హిట్ తగలకపోతే స్టార్ హీరోలను కూడా ఆడియన్స్ మర్చిపోతారు. వరుసగా నాలుగు ప్లాప్స్ ఇచ్చిన కృతి పట్ల నెగిటివిటీ పెరిగింది. మేకర్స్ ఒకింత ఆలోచిస్తున్నారు. గతంలో మాదిరి ఎడాపెడా ఆఫర్స్ రావడం లేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అందులోనూ శ్రీలీల నుండి కృతికి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హవా శ్రీలీలదే, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ చిత్రాలతో కలిపి ఏకంగా 7 సినిమాలు చేస్తుంది. అలాగే ఓ కన్నడ మూవీ కూడా ఉంది. కృతికి విజయాలు దక్కి ఉంటే వాటిలో కొన్ని ఆమె సొంతం అయ్యేవి. ధమాకా హిట్ తో శ్రీలీల అవకాశాలన్నీ పట్టేస్తుంది. కృతి శెట్టికి వెంటనే ఒక సాలిడ్ హిట్ పడాలి. దాని కోసం ఆమె తపిస్తున్నారు.

శ్రీలీల తెలుగులో హీరో శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. జయం రవికి జంటగా ఇటీవల ఒక చిత్రం ప్రకటించారు. అలాగే ఒక మలయాళ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. కాగా ఉప్పెన మూవీతో కృతి సంచలనం చేశారు. వంద కోట్లకు పైగా ఉప్పెన వసూళ్లు రాబట్టింది. అనంతరం శ్యామ్ సింగరాయ్ మూవీతో మరో హిట్ కొట్టింది. బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. నాగ చైతన్యకు జంటగా నటించిన బంగార్రాజు అనంతరం కృతి శెట్టికి విజయం లేదు.