Krithi Shetty: తెలుగు తెర పై ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ ‘కృతి శెట్టి’, ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మడికి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. మరో వైపు ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కృతి శెట్టి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది.

మీడియా వారు ఆమె ప్రేమ గురించి, పెళ్లి గురించి ప్రశ్నించగా, తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపర్చింది. ‘కృతి శెట్టి’తో మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు ?, అసలు పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటీ ? అంటూ ప్రశ్నించారు. దానికి ‘కృతి శెట్టి’ స్పందిస్తూ… నా సినీ కెరీర్ లో నేను విజయవంతం అవ్వడం కోసం ప్రస్తుతం చాలా కష్టపడుతున్నాను.
Also Read: Pakistan Appreciates NTR: పాకిస్థాన్ లోనూ ప్రభంజనం సృష్టిస్తోన్న ఎన్టీఆర్ !
అందుకే, నా జీవితంలో పెళ్లి అనే ట్యాగ్ ను త్వరగా వేసుకోవాలని నేను అనుకోవడం లేదు’ అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ‘కృతి శెట్టి’ ఇంకా చాలా చిన్న పిల్ల అట. ఆమె పెళ్లి చేసుకోవడానికి మరో పదేళ్లు సమయం ఉందని ఆమె తల్లి కూడా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ‘కృతి శెట్టి’ తాను బాగా స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తోందట.

ప్రస్తుతానికి అయితే, ఆమెకు వచ్చే సంపాదన విషయంలో ఆమె చాలా సంతోషంగా ఉంది. కాబట్టి.. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని స్థిరపడాల్సిన అవసరం ఏమిటి ? అంటూ ‘కృతి శెట్టి’ మాట్లాడుతుంది. మొత్తానికి ‘కృతి శెట్టి’ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేదు. ఓ యంగ్ హీరోతో గత కొంత కాలంగా ఈ కుర్ర బ్యూటీ ప్రేమలో ఉందని కూడా టాక్ నడుస్తోంది.
తన ప్రేమ కారణంగా… తన పెళ్లి త్వరలో జరుగుతుందని ప్రచారం చేస్తారనే భయంతోనే… ‘కృతి శెట్టి’ పై విధంగా కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ, అమ్మడు అభిమానులు మాత్రం.. ఇదేంటి ? ఈ బ్యూటీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందేంటీ అంటూ అంతా అవాక్కవుతున్నారు. ఇప్పట్లో తన పెళ్లి గురించి మళ్లీ టాపిక్ ఎత్తను అన్నట్లుగా కూడా ఉంది ఈ అమ్మడు అభిప్రాయం.
Also Read:The Story Was Planned Before Bahubali: బాహుబలి కి ముందు అనుకున్న స్టోరీ ఇదే..ఇలా తీసి ఉంటే సినిమా ఏమి అయ్యేదో!
Recommended videos
[…] […]