Krithi Shetty: ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో ఉప్పెన ఓ సంచలనం. లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఉప్పెన భారీ కమర్షియల్ హిట్ కొట్టింది. డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, ముగ్గురు కొత్తవాళ్ల కాంబినేషన్ లో వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్, యూత్ ని ఊపేసింది. దేవిశ్రీ సాంగ్స్ జనాలకు తెగ నచ్చేశాయి, ఎక్కడ చూసినా, ఈ మూవీ సాంగ్స్ వినిపించాయి.

అందుకే ఈ సినిమా విజయంలో కృతి శెట్టి చాలా కీలకం అయ్యింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ యంగ్ బ్యూటీ కుర్రాళ్ళ మనసులు దోచేసింది. ఆకట్టుకునే నటనతో పాటు వైష్ణవ్ తో ఆమె హైవోల్టేజ్ రొమాన్స్ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. ఇక మొదటి సినిమాలోనే లిపి లాక్ సన్నివేశాల్లో నటించి, సంచలనం రేపింది. ఉప్పెన మూవీలో హీరో వైష్ణవ్ కి కృతి లిప్ కిస్ ఇవ్వడంతో, అతడిని జ్వార్వం వస్తుంది.
ఇక ఎప్పుడు వైష్ణవ్ కి కిస్ ఇవ్వాలన్నా… కృతి రొమాంటిక్ గా ” జ్వరం కావాలా నీకు” అంటూ అడుగుతుంది. ఈ డైలాగ్ అప్పట్లో పిచ్చ ఫేమస్ అయ్యింది. కాగా తన లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ మూవీలో కూడా లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయింది కృతి శెట్టి. శ్యామ్ సింగరాయ్ టీజర్ లో కూడా నానికి లిప్ కిస్ ఇస్తున్న సీన్ హైలైట్ అయింది.
దీనితో కృతి ఉప్పెనలో మాదిరి, నానికి కూడా కృతి జ్వరం ఇచ్చి ఉంటుందని, నెటిజెన్స్ కామెంట్స్ పేల్చుతున్నారు. హోమ్లీ లుక్ లో కనిపించే ఈ కన్నడ బ్యూటీ… కెరీర్ బిగినింగ్ లోనే ఇలా లిప్ లాక్ సన్నివేశాల్లో రెచ్చిపోవడం, సంచలనంగా మారింది.
Also Read: Bigg Boss 5 telugu: బిగ్ బాస్ అంతా స్క్రిప్ట్ అబ్బా… ఇదిగో ప్రూఫ్ !
ఇక డెబ్యూ చిత్రంతోనే భారీ హిట్ కొట్టిన కృతి శెట్టికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. నాగ్ – చైతుల మల్టీస్టారర్ బంగార్రాజు మూవీలో నాగలక్ష్మీ అనే పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్న కృతి, రామ్ – లింగు స్వామి మూవీతో పాటు సుధీర్ బాబుతో కూడా ఓ సినిమా చేస్తోంది.