https://oktelugu.com/

‘రష్మిక’ను ఫాలో అవుతోన్న క్రేజీ బ్యూటీ !

‘రష్మిక మండన్నా’లో ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు గానీ, ఆమె మాత్రం సినిమా ఇండస్ట్రీ బాగా తెలివిమీరి పోయింది. ముదురు పోయిన హీరోయిన్స్ కే సాధ్యం కానీ, టైంను టైమింగ్ ను రష్మిక సింపుల్ గా మ్యానేజ్ చేస్తోంది. పైగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే.. ఆ ఇండస్ట్రీ పద్దతులను ఫాలో అవుతూ.. అక్కడ హీరోలను డైరెక్టర్లను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. […]

Written By:
  • admin
  • , Updated On : June 18, 2021 / 02:17 PM IST
    Follow us on

    ‘రష్మిక మండన్నా’లో ఇంకా చిన్నపిల్లల చేష్టలు పోలేదు గానీ, ఆమె మాత్రం సినిమా ఇండస్ట్రీ బాగా తెలివిమీరి పోయింది. ముదురు పోయిన హీరోయిన్స్ కే సాధ్యం కానీ, టైంను టైమింగ్ ను రష్మిక సింపుల్ గా మ్యానేజ్ చేస్తోంది. పైగా ఏ ఇండస్ట్రీకి వెళ్తే.. ఆ ఇండస్ట్రీ పద్దతులను ఫాలో అవుతూ.. అక్కడ హీరోలను డైరెక్టర్లను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు పోతుంది.

    ఈ క్రమంలో ఈ మధ్య కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. కారణం బాలీవుడ్ లో రష్మిక ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. అందుకే ఎక్కువగా ముంబైలోనే ఉంటూ అక్కడ స్టార్ హీరోలను రెగ్యులర్ గా కలుస్తూ బిగ్ ఛాన్స్ ల కోసం తన వంతుగా కొన్ని కసరత్తులు, ప్రయత్నాలు చేస్తోంది. అయితే, బాలీవుడ్ భామలు అందాల ప్రదర్శనలో ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటారు. దాంతో అక్కడి పద్దతికి తగ్గట్లు మేకోవర్ అయిపోయింది రష్మిక.

    బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా తన గ్లామర్ షోతో కుర్రకారుని మరింతగా ఆకట్టుకుంటూ, నిత్యం జిమ్ కి వెళ్తూ అక్కడి ఫొటోగ్రాఫర్లకు పని చెబుతూ వారి ముందు టిప్ టాప్ గా రెడీ అవుతుందట. మొత్తానికి రష్మికను చూసి, కొత్త భామ కృతి శెట్టి కూడా రష్మికనే ఫాలో అయిపోతుంది. అయితే, కృతి శెట్టి బాలీవుడ్ లో ఏ సినిమా చెయ్యడం లేదు. కానీ రష్మిక బాలీవుడ్ లో చేస్తోన్న చేష్టలు పసిగట్టి,

    ఈ అమ్మడు ఇక్కడ టాలీవుడ్ లో వాటిని అమలు పరుస్తూ ముందుకు పోతుంది. అందుకే, తాజాగా కొత్త మేకోవర్ చేయించుకొని మెల్లగా గ్లామర్ రూట్లోకి వచ్చి, అందాల ప్రదర్శనకు తేరా తీసింది కృతి. నిన్న కొన్ని బోల్డ్ ఫోటో షూట్ లు కూడా చేసిందని టాక్. త్వరలోనే అవి రిలీజ్ అవనున్నాయి. ఏది ఏమైనా కృతి శెట్టి తన అందాల విందు విషయంలో రష్మికను ఫాలో అవ్వడం నిజంగా విశేషమే.