Krishnam Raju: ఆయనది తేజోవంతమైన ముఖవర్చస్సు, ఆయనవి పెద్ద పెద్ద చురుకైన కళ్ళు, ఇక ఆయన విశాలమైన ఛాతీ చూస్తే సగటు మనిషి భయపడతాడు, తెలుగు ప్రేక్షకులు ఆయన కండలు తిరిగిన శరీరాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఆయనే ఆరడుగుల ఆజానుబాహుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. కానీ తాజాగా కృష్ణంరాజు ఫోటోను చూసి.. ఇదేమిటి ? కృష్ణంరాజు ఇలా అయిపోయాడేమిటి ? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
Took blessings of the original Rebel Star! 🙏 💪🏽❤️ pic.twitter.com/dY33azmqxm
— Vishnu Manchu (@iVishnuManchu) October 4, 2021
మా ఎలక్షన్స్ నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజును కలిసాడు మంచు విష్ణు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ.. ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఫోటోలో కృష్ణంరాజును చూసి ఆయన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భారీ పర్సనాలిటీతో ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా నవ్వుతూ ఉండే కృష్ణంరాజు మరోలా కనిపించారు.
బాగా నీరసంగా కృంగిపోయినట్టు, ఏదో అనారోగ్యంతో కృశించి పోయినట్టు కనిపించారు. ముఖ్యంగా కృష్ణంరాజు మోహంలో ముడతలు పడిన బిక్కమొహం కనిపించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు కృష్ణంరాజుకి ఏమైంది ? మూడు నాలుగు నెలల క్రితం వరకూ ఆయన బాగున్నారు. మరి ఈ మూడు నెలల వ్యవధిలోనే ఎందుకు ఆయన ఇలా మారిపోయారు ? ఆయనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ?
ఎంతో క్రమశిక్షణతో ఉండే ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం అసలు తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. అయితే కృష్ణంరాజుకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అని, కాకపోతే.. ఏదో జ్వరం లాంటిది వచ్చి ఇలా అయిపోయి ఉంటారని.. రెబల్ స్టార్ త్వరలోనే మునుపటిలా మారతారని కృష్ణంరాజు సన్నిహితులు చెబుతున్నారు.
అయితే, నిజానికి రీసెంట్ గా కృష్ణంరాజు గాయపడ్డారు. ఆయన మెట్లు దిగుతూ తన ఇంటిలో జారీ పడ్డారు. ఆ పడిపోవడంతో ఆయన కాలుకు ప్యాక్చర్ అయింది. దీంతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే డాక్టర్లు ఆయన తుంటికి శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది. కృష్ణంరాజు ప్రస్తుతం బీజేపీ పార్టీ సభ్యుడిగా కొనసాగతున్నారు.