Mahesh Babu Beauty Secret: ఘట్టమనేని కుటుంబ సభ్యులు ‘సర్కారువారి పాట’ సక్సెస్ జోష్ లో ఉన్నారు. మహేశ్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా విజయవంతం కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ తో మహేశ్ ఫ్యామిలీతో పాటు కృష్ణ ఫ్యామిలీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ 160 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు 100 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. దీంతో మహేశ్ బాబుపై కుటుంబ సభ్యులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేకంగా మహేశ్ బాబును అభినందించారు. ఈ సినిమా హిట్టవుతుందని ముందే చెప్పిన కృష్ణ అనుకున్నట్లుగా పాజిటివ్ టాక్ రావడంతో అమితానందంలో ఉన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గురించి కృష్ణ ఓ సీక్రెట్ ను బయటపెట్టాడు. ఆ విశేషాలేంటో చూద్దాం.

బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు కొడుకు దిద్దిన కాపురం.. తదితర సినిమాల్లో నటించారు. అలనాటి కాలంలో కృష్ణ సినిమాల్లో ఆయనకు తమ్ముడిగా నటించారు. ఆ సమయంలో బాలనటుడైనా యంగ్ కుర్రాడిలా నటనతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ ఇప్పటికే ఒకే రకమైన ఫిట్ నెస్ ను మెయింటేన్ చేస్తున్నాడు. 43 ఏళ్లు దాటిన మహేశ్ ఇప్పటికీ యంగ్ కుర్రాడిలా కనిపిస్తాడు. అమ్మాయిల రాకుమారుడైన ఆయన కాలేజ్ కుర్రాడిలా సినిమాల్లో నటించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండస్ట్రీలో చర్చించుకుంటారు.
Also Read: Cannes 2022: ‘కాన్స్’ లోనూ నార్త్ భామలతో పోటీ పడుతున్న సౌత్ భామలు
అయితే మహేశ్ ఇంత అందంగా ఉండడానికి కారణమేంటి..? అనే విషయాన్ని కొందరు కృష్ణ ను అడిగారు. దీంతో కృష్ణ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. మహేశ్ సినిమాలు లేని సమయంలో ఎక్కువగా జిమ్ సెంటర్లోనే ఉంటాడట. నిత్యం వ్యాయామం చేస్తూ శరీరాన్ని క్రమ పద్ధతిలో ఉంచుతాడట. బాడీలో ఏమాత్రం వేస్టేజీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తారట. అందుకే మహేశ్ ఇంత క్యూట్ గా ఉంటాడని కృష్ణ నవ్వుతూ చెప్పాడు.

ఇక మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు. వీరి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. గతంలోనే కథను రెడీ చేసిన త్రివిక్రమ్ మహేశ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. త్వరలోనే సెట్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు కృష్ణ బయోపిక్ లో నటించాలని ఓ డైరెక్టర్ మహేశ్ బాబును అడిగారట. కానీ మహేశ్ అందుకు ఒప్పుకోలేదట. నాన్న గారి బయోపిక్ ను టచ్ చేయనని, వేరే హీరో తో చేయాలని కోరాడట.
Also Read:Bigg Boss Non Stop Anchor Shiva: బిగ్ బాస్ నాన్ స్టాప్: ఎలాంటి అంచనాల్లేకుండా టాప్ 3గా యాంకర్ శివ ఎలా ఎదిగాడు?
Recommended Videos



[…] Also Read: Mahesh Babu Beauty Secret: మహేష్ బాబు అందం రహస్యం లీక్… […]
[…] Read: Mahesh Babu Beauty Secret: మహేష్ బాబు అందం రహస్యం లీక్… Recommended […]