Prabhas Anushka Marriage: నాలుగు పదులు దాటి 50 ఏళ్లకు చేరువ అవుతున్నా ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ గానే ఉంటున్నాడు తప్ప ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు. దానికి కారణం ఏంటో ఆయనకు, ఆయన పెదనాన్న కృష్ణంరాజు ఫ్యామిలీకి తప్ప ఎవరికీ తెలియదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న ప్రశ్న తర్వాత ‘ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు’ అన్న ప్రశ్నే ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

40 ఏళ్లు దాటినా పెళ్లి పెటాకులు లేకుండా ప్రభాస్ ఎందుకు ఇలా ఉంటున్నాడన్నది అంతుబట్టని ప్రశ్న. బాహుబలి తర్వాత పెళ్లి చేసుకుంటానన్న ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ జెట్ స్పీడుగా దూసుకెళుతున్నాడు. మీడియాలో మాత్రం పెళ్లి వార్తలపై నిత్యం ఏదో ఒక గాసిప్ వస్తూనే ఉంటోంది.
Also read: Prabhas Salaar Movie: ‘సలార్’ గురించి అదిరిపోయే సీక్రెట్ చెప్పిన ప్రభాస్
రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటున్న ప్రభాస్ గురించి మళ్లీ పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. తనకు పెళ్లి కాకపోవడానికి కారణం తాను అమ్మాయిల విషయంలో వేసుకున్న లెక్కలు ఫెయిల్ అయ్యాయని.. పెళ్లి కాలేదేమోనని రాధేశ్యామ్ ప్రమోషన్ లో చెప్పుకొచ్చాడు. ప్రభాస్ కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. దీంతో అనుష్కతో ప్రభాస్ లవ్ మ్యారేజ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

అనుష్కతో ప్రభాస్ ప్రేమ, పెళ్లి వార్తలపై కృష్ణం రాజు భార్య స్పందించారు. శ్యామలదేవీ తాజాగా మాట్లాడుతూ.. ‘ప్రభాస్ కు మన సంస్కృతి సంప్రదాయాలంటే ఎంతో గౌరవం. మహిళలంటే గౌరవం ఉంది. కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తారు. ప్రభాస్ పెళ్లి జరుగుతుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు’ అని తెలిపింది. ఇక అనుష్కతో ప్రభాస్ పెళ్లి వార్తల్లో నిజం లేదని శ్యామలాదేవీ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ కాబోయే అమ్మాయి ఎవరో ఇప్పుడే చెప్పలేనని తెలిపారు.
[…] […]