K Ramp Trailer Review: ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త హీరోల్లో చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎస్ ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.గత సంవత్సరం ఆయన హీరోగా వచ్చిన క సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా అందుకున్న సక్సెస్ తో ఆయన వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం ఈనెల 18వ తేదీన కే ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొద్దిసేపటికి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను ఆద్యంతం కామెడీతో నింపేశారు. కిరణ్ అబ్బవరం ఇప్పటివరకు ఇలాంటి ఒక జోవియల్ క్యారెక్టర్ లో నటించలేదు. ఫుల్ లెంత్ కామెడీని పండిస్తూ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. ఆమె తనను రిజెక్ట్ చేయడంతో అప్సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే విషయంలో క్లారిటీ లేకుండా ఏది పడితే అది చేసేసి తన కామెడీని పండిస్తున్నాడు. అందులో భాగంగానే విచిత్రమైన క్యారెక్టరైజేషన్ లో సాగాడు. ఇక ఇలాంటి ఒక క్యారెక్టర్ కామెడీని పండిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ప్రతి సీన్ లో బూతు కామెడీని ఎలివేట్ చేయాలని చూశారు. ఇక ట్రైలర్ లో ఏ ఒక్క సెంటిమెంట్ సీను గాని, ఎమోషనల్ సీన్ గాని పడలేదు.
కావాలనే ట్రైలర్ అలా కట్ చేశారా? సినిమాలో ఎమోషన్ కి పెద్దగా స్కోప్ లేదా కేవలం కామెడీని బేస్ చేసి ఈ సినిమాని తీశారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. కిరణ్ అబ్బవరం క సినిమాలో ఎమోషన్ సన్నివేశాలు చాలా ఉంటాయి. ఆయన కూడా ఆ సీన్స్ లో చాలా బాగా నటించి మెప్పించాడు.
ఇక ఈ సినిమాలో సైతం అలాంటి కొన్ని సన్నివేశాలు పడితేనే సినిమా సక్సెస్ అవుతోంది. లేకపోతే మాత్రం ఈ సినిమా నిరాశను మిగిల్చే అవకాశమైతే ఉంది. కాబట్టి ట్రైలర్లో చూపించని ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలు ఉంటే తప్ప సినిమా ప్రేక్షకుడిని మెప్పించదు. ఇక అన్ని సినిమాల్లో కామెడీ అనేది సర్వసాధారణం అయిపోయింది.
మూవీస్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కానీ, కామెడీ షో లలో కానీ చాలా జన్యూన్ కామెడీ దొరుకుతోంది. దానిని మించిన కామెడీ సినిమాలో ఉన్నప్పుడే అది ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతోంది. కాబట్టి కామెడీని నమ్ముకొని సినిమా చేయడం అనేది కరెక్ట్ కాదు. దాంట్లో ఎమోషన్ పర్ఫెక్ట్ గా సెట్ అయితేనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తోంది. లేకపోతే మాత్రం ఈ సినిమా షెడ్ కి వెళ్లాల్సిందే…
