Kotha Lokah Box Office Collections: ఈ ఏడాది ఎలాంటి హంగామా లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ‘లోక'(Lokah Movie) అనే చిత్రం ఒకటి. ప్రముఖ మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ లో కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) కీలక పాత్ర పోషించింది. ‘ప్రేమలు’ హీరో నెస్లేన్ ఇందులో హీరో గా నటించాడు. మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతూ వెళ్ళింది. ఫలితంగా 18 రోజుల్లో అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 248 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది ఈమధ్య కాలం లో జరగలేదు. ఎప్పుడో అరుంధతి సినిమాకు ఇలాంటి వసూళ్లను చూసాము. చాలా మంది సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ కి కూడా ఈ సినిమాకు వచ్చినంత కలెక్షన్స్ రాలేదు.
18 వ రోజు, అనగా నిన్న కూడా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నిన్న ప్రతిష్టాత్మక ఇండియా వెర్సస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండడం తో కలెక్షన్స్ పై కాస్త ప్రభావం పడింది. లేదంటే కచ్చితంగా ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చేవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కేరళ రాష్ట్రం లో 88 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా తమిళనాడు లో 16 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 6 కోట్ల 35 లక్షలు, ఓవర్సీస్ నుండి 108 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి 246 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 108 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ ఈ చిత్రానికి జరిగింది కేవలం 27 కోట్ల రూపాయిలు మాత్రమే, కానీ వచ్చిన లాభం మాత్రం 82 కోట్ల రూపాయిలు. అంటే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఈ ఏడాది కేరళ ఇండస్ట్రీ అత్యధిక సక్సెస్ రేట్ లో ఉంది. విడుదలైన ప్రతీ సినిమా సూపర్ హిట్ రేంజ్ కి చేరుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా వాళ్లకు లాభాల వర్షం కురిపించడమే కాకుండా, తెలుగు, తమిళ రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టి ఆ ఇండస్ట్రీస్ లో కూడా బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం.