Kota Srinivasarao Interview: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao)… ఆయన నిన్న రాత్రి కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా ఒక దిగ్గజ నటుడిని కోల్పోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టినప్పటికి ఆయన చేసిన ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు… ఇక ప్రస్తుతం మనతోపాటు లేకపోయినప్పటికి ఆయన గతిలో మాట్లాడిన మాటలు, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జనరేషన్ లో ఉన్న హీరోల్లో తనకు ఎక్కువగా నచ్చిన హీరోలు ఎవరు అని అడగగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఇక దాంతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ లా డైలాగులు చెప్పే హీరోలు ఇండస్ట్రీలో ఎవరూ లేరని కూడా చెప్పడం విశేషం…
ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ గాని, డాన్సులు గాని అద్భుతంగా చేస్తాడు అంటూ చెప్పాడు. మహేష్ బాబు చాలా అందగాడని ఎంతమంది హీరోలు వచ్చిన కూడా అతని అందం ముందు నిలబడలేరని చెప్పాడు… ఇక ఈ ముగ్గురు హీరోల అభిమానులు ప్రస్తుతం ఆ మాటలను గుర్తు చేసుకుంటూ కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం పట్ల తీవ్రమైన దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: RK Comments Jagan: జగన్ ను హీరో అంటున్న వేమూరి రాధాకృష్ణ
ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు ఇక మీదట ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టమనే చెప్పాలి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా పలు రకాల క్యారెక్టర్ లను పోషించడమే కాకుండా ఆయన చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేయగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…
ఇక ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్ నటులు చనిపోతూ ఉండడం ఇండస్ట్రీకి తీరని లోటుగా మారుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగినప్పటికి, ఒక్కప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడం లో కృషి చేసిన కొంతమంది సీనియర్ నటుడు ఒక్కరోక్కరిగా నేల రాలిపోవడం అనేది కొంతవరకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి…
‘ప్రాణం ఖరీదు’తో కోట, నేను.. ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం: చిరంజీవి#KotaSrinivasaRao pic.twitter.com/mJ2klGrwVF
— Eenadu (@eenadulivenews) July 13, 2025