Homeఎంటర్టైన్మెంట్Kota Srinivasa Rao Oscar Tribute In Memoriam: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో కోట...

Kota Srinivasa Rao Oscar Tribute In Memoriam: ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ లో కోట శ్రీనివాస రావు కి అరుదైన గౌరవం.. చరిత్రలో ఇదే తొలిసారి!

Kota Srinivasa Rao Oscar Tribute In Memoriam: రీసెంట్ గానే లాస్ ఏంజిల్స్ లో 98 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక అత్యంత అట్టహాసంగా మొదలైంది. ఈసారి మన ఇండియన్ సినిమాలకు ఎలాంటి ఆస్కార్ అవార్డు దక్కలేదు కానీ , మన తెలుగు దిగ్గజ నటుడు , దివంగత కోట శ్రీనివాస రావు కి మాత్రం అరుదైన గుర్తింపు లభించింది. ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్ లో గత ఏడాది చనిపోయిన ప్రముఖ నటీనటుల ఫోట్లను ఆస్కార్ వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్ లో ప్రదర్శించారు. కోట శ్రీనివాస రావు తో పాటు, ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి గొప్ప సేవలు అందించిన కళాకారులకు సంబంధించిన ఫోటోలను ప్లే చేసి, వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. గతం లో ఇలాంటి సంస్కృతి ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో ఉండేది కాదు, ఈ సంవత్సరం నుండే ప్రవేశపెట్టారు. అయితే ఈ సెగ్మెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఫోటో వెయ్యలేదని బాలీవుడ్ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

గత ఏడాది నవంబర్ 24 న ధర్మేంద్ర చనిపోయాడు. ఆయన వయస్సు 89 ఏళ్ళు ఉంటుంది. 40 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ధర్మేంద్ర సినీ రంగానికి చేసిన సేవలు ఎనలేనిది. ఒకప్పుడు సూపర్ స్టార్ గా, బాలీవుడ్ నెంబర్ 1 హీరో గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి , కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ధర్మేంద్ర, తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నాడు. అలాంటి లెజెండ్ కి సంబంధించిన ఫోటో ని ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ప్రదర్శించకపోవడం దురదృష్టకరమని బాలీవుడ్ ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేయగా, సమయం తక్కువ ఉండడం వల్ల ప్రదర్శించలేకపోయామని, కానీ ఆస్కార్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్ లో ధర్మేంద్ర గారి ఫోటో, పేర్లు ఉన్నాయని క్లారిటీ ఇచింది ఆస్కార్ అవార్డ్స్ జ్యూరీ.

అయితే మన కోట శ్రీనివాస రావు గారికి మాత్రం ఈ అరుదైన గౌరవం దక్కడం పై మన తెలుగు ఆడియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో దశాబ్దాల నుండి మూవీ లవర్స్ ని తన అద్భుతమైన నటనతో అలరిస్తూ, తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాస రావు కి ఈ గౌరవం తగనిదే. ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీ లో స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ఈ సందర్భంగా కోట శ్రీనివాస రావు ని మరోసారి గుర్తు చేసుకున్నారు నెటిజెన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular